కోర్టులో జడ్జిపై తిరగబడ్డ లాయర్లు.. లాఠీలు విరిగేలా కొట్టిన పోలీసులు(వీడియో)
కోర్టులో జడ్జిపై దురుసుగా ప్రవర్తించిన న్యాయవాదులపై లాఠీ విరిగింది. కోర్టు హాలులోనే వారిపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయవాదులు నిరసనకు దిగారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లా కోర్టులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బార్ అసోషియేషన్ అధికారికి చెందిన ఓ కేసు విషయమై న్యాయవాదులు ఘజియాబాద్ జిల్లా కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ సమయంలో లోపల ఉన్న న్యాయవాదులు జిల్లా జడ్జితో దురుసగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. దీంతో ఆగ్రహించిన న్యాయమూర్తి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కోర్టు హాలులోకి వచ్చిన పోలీసులు వారిని అదుపు చేసే ప్రయత్నం చేశారు.

గాయపడిన న్యాయవాదులు?
న్యాయవాదులను అదుపు చేసే క్రమంలో పోలీసులు కోర్టు గదిలోనే వారిపై లాఠీఛార్జి చేశారు. బలవంతగా వారిని బయటకు పంపేందుకు ప్రయత్నంచారు. ఈ పెనుగులాటలో కొందరు న్యాయవాదులు గాయపడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు కోర్టు హాలులో న్యాయవాదులు విధులను బహిష్కరిస్తున్నట్లు ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. అలాగే, బార్ అసోసియేషన్ న్యాయవాదుల సమావేశం తర్వాత న్యాయవాదులు తదుపరి వ్యూహాన్ని వెల్లడిస్తారని సమాచారం.
Ghaziabad, chaos erupted as lawyers clashed with baton-wielding police in a courtroom during a case hearing, leading to police chasing lawyers out. No serious injuries were reported.#Ghaziabad #Police #Lawyer #Ghaziabadpolice #GhaziabadClash #Rajnagar #Sessioncourt #Court pic.twitter.com/HbtKem8L4z
— Lokmat Times Nagpur (@LokmatTimes_ngp) October 29, 2024
కుర్చీలను పైకిలేపి మరీ..
తాజాగా కోర్టు హాల్‌లోనే లాయర్లను కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 20 నుంచి 35 మంది పోలీసులు న్యాయవాదులను లాఠీలతో కొట్టడం ఈ వీడియోలో చూడొచ్చు. కోర్టు హాలులో ఉన్న కుర్చీలను పైకిలేపి మరీ.. పోలీసులు న్యాయవాదులను నియంత్రించేందుకు చేసిన ప్రయత్నాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో న్యాయస్థానాల్లో ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్న విషయం తెలిసిందే.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications