వైరల్ వీడియో: ఇలా ఉన్నారేంట్రా బాబూ..!
సాధారణంగా అర్జెంట్ పని ఉన్న వాళ్లు.. ద్విచక్రవాహనం లేని వాళ్లు ర్యాపిడో వాడతారు. మెట్రోపాలిటన్ నగరాలతోపాటు అనేక పట్టణాల్లోనూ ఇప్పుడు ర్యాపిడో, ఓలా, ఊబర్ సర్వీసులు వచ్చేశాయి. దాంతో ఉద్యోగులు, ఇతర ముఖ్యమైన పనులకు వెళ్లేవాళ్లు వీటిని బుక్ చేసుకుంటున్నారు. మరికొంతమంది బస్సుల్లో, మెట్రోల్లో ప్రయాణం చేస్తున్నారు. అయితే ఇటీవలికాలంలో సోషల్ మీడియా ప్రభావంతో కొంతమంది చేస్తున్న వింత చేష్టలకు హద్దు లేకుండా పోయింది. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

ఓ వ్యక్తి ర్యాపిడోను బుక్ చేశాడు. కానీ అతడు ఎందుకు బుక్ చేశాడు అని తెలిస్తే షాక్ అవుతారు. ఈ విషయం తెలిస్తే ర్యాపిడోను ఇలా కూడా వాడతారా అని నోరువెళ్లబెడతారు. ఓ వ్యక్తి తన ఇంటి చెత్తను పారవేయడానికి ర్యాపిడో బైక్ ను బుక్ చేశాడు. ర్యాపిడో పార్శిల్ సర్వీస్ కోసం ఆ వ్యక్తి ర్యాపిడోను బుక్ చేసుకున్నాడు. కానీ.. ఇంటి చెత్తను పారవేయడానికి బుక్ చేశాడని తెలియగానే ఆ చెత్తను అక్కడే పడేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
मुंबई में कचरा फेंकने के लिए बुक किया rapido
— The Bharatmitra (@The_Bharatmitra) September 4, 2025
रैपिडो वाले ने कुछ यूँ दिया जवाब#MumbaiNews #Rapido #ViralNews #SwachhBharat #CleanIndia #SocialMessage #TrendingStory #TheBharatMitra #ViralMumbai pic.twitter.com/wITB4HXfyD
ఈ వీడియోను చూసిన నెటిజెన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఇలా ఉన్నారేంట్రా బాబూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే వాడకం అంటే ఇదే బ్రో అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది మరీ ఇంత బద్దకమా..? ఇలా తయారయ్యారేంట్రా.. అంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications