Leader: పొలిటికల్ లీడర్ ను వెంటాడి వెంటాడి నరికేశారు. అర్దరాత్రి ఏం పని ?
చెన్నై/ విల్లుపురం: రాజకీయాల్లో ఉంటున్న వ్యక్తి వ్యాపారం చేస్తున్నాడు. ప్రముఖ పార్టీ రాజకీయ నాయకుడు అయిన ఇతను ప్రభుత్వ కాంట్రాక్ట్ పనులు చేయిస్తున్నాడు. ఈ రాజకీయ నాయకుడికి పలువురితో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని సమాచారం. కారులో ఇతను తిరుగుతున్నాడు. అర్దరాత్రి ఆ పొలిటికల్ లీడర్ కారులో కాకుండా బైక్ లో బయలుదేరాడు. మార్గం మద్యలో పొలిటికల్ లీడర్ ను అడ్డగించిన ప్రత్యర్థులు అతన్ని నడిరోడ్డు మీద వెంటాడి అతి దారుణంగా నరికి చంపేయడం కలకలం రేపింది.

పొలిటికల్ లీడర్
తమిళనాడులోని విల్లుపురం జిల్లాలోని విక్రమ్ వాడి సమీపంలోని కప్పియంబులియూర్ లో ఆదిత్యన్ (50) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. పీఎంకే పార్టీలో ఆదిత్యన్ చాలా చురుకుగా ఉంటున్నాడు. విల్లుపురం జిల్లా పీఎంకే పార్టీ సెక్రటరీగా పని చేస్తున్న ఆదిత్యన్ ఆపార్టీలో ప్రముఖ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

ప్రభుత్వ కాంట్రాక్ట్ లు
ఆదిత్యన్ ఎక్కువగా ప్రభుత్వ కాంట్రాక్ట్ పనులు చేయిస్తున్నాడు. పలు పార్టీల రాజకీయ నాయకులతో ఆదిత్యన్ కు ఎక్కువ పరిచయాలు ఉన్నాయి. ఆదిత్యన్ కాంట్రాక్టర్ కావడంతో పలువురితో అతనికి ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని సమాచారం. ఆదిత్యన్ ఎక్కువగా కారులో తిరుగుతున్నాడు.

అర్దరాత్రి పొలిటికల్ లీడర్ దారుణ హత్య
అర్దరాత్రి ఆదిత్యన్ విక్రమ్ వాడిలో పనిముగించుకుని కారులో కాకుండా బైక్ లో కప్పియంపులిలోని ఇంటికి బయలుదేరాడు. మార్గం మద్యలో పొలిటికల్ లీడర్ ను అడ్డగించిన ప్రత్యర్థులు అతన్ని నడిరోడ్డు మీద వెంటాడి వేటకొడవళ్లతో నరికి కత్తులతో పొడిచి రోడ్డు పక్కనే అతి దారుణంగా నరికి చంపేశారు.

కారులో కాకుండా బైక్ లో వెళ్లి ?
ఉదయం అటువైపు వెలుతున్న వాళ్లు ఆదిత్యన్ హత్యకు గురైన విషయం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆదిత్యన్ శరీరం మొత్తం కత్తిపోట్లు, వేటకొడవళ్తతో నరికిన గాయాలు అయ్యాయని, హత్యకు కచ్చితమైన కారణాలు తెలియడం లేదని, కేసు విచారణలో ఉందని పోలీసు అధికారులు తెలిపారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications