MH Elections: పెరుగుతున్న టెన్షన్ - డేంజర్ బెల్స్..!!
Maharashthra Elections: మహారాష్ట్రలో పోలింగ్ కు కౌంట్ డౌన్ కొనసాగుతోంది. నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తరువాత ముఖ్య నేతల్లో టెన్షన్ మొదలైంది. రెండు కూటముల మధ్య ఇక్కడ ప్రధానంగా పోటీ కనిపిస్తోంది. ఇదే సమయంలో ఈ రెండు కూటముల్లోనూ దాదాపు 50 మంది రెబల్స్ బరిలో ఉన్నారు. ఈ నెల నాలుగో తేదీ నామినేషన్ల ఉప సంహరణకు తుది గడువు. వీరిని బుజ్జగించేందుకు ముఖ్య నేతలు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు.
బరిలో రెబల్స్
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం ఊపందుకుంది. రెండు కూటముల నుంచి ఇప్పటికే స్టార్ క్యాంపెయినర్లు రంగంలోకి దిగారు. సోమవారం నుంచి ప్రచారం మరింత హీటెక్కటం ఖాయంగా కనిపిస్తోంది. రెండు కూటములు తమ మేనిఫెస్టోలకు పదును పెడుతున్నాయి. రెండు కూటముల నుంచి పోటీలో ఉన్న రెబల్స్ విషయం మాత్రం ఆందోళన పెంచుతోంది. నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్ 4 చివరి తేదీగా ఉన్న నేపథ్యంలో వారిని ఒప్పించడానికి ఇప్పుడు ముఖ్య నేతలు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేసారు.

ముఖ్య నేతలకు పరీక్ష
అంధేరి ఈస్ట్ నుంచి మాజీ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ప్రదీప్ శర్మ భార్య స్వికృతి శర్మ శివసేన రెబల్ గా పోటీలో ఉన్నారు. సీటు దక్కకపోవటంతో రెబల్ గా నామినేషన్ వేసారు. ఇక్కడి నుంచి బీజేపీ నేత ముర్జీ పటేల్‌ను రంగంలోకి బీజేపీ కూటమి బరిలోకి దించింది. దీంతో, షిండే టీం వారిని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ స్వికృతి శర్మ నో చెబుతున్నారు. బీజేపీకి చెందిన దాదాపు 10 మంది అభ్యర్థులు తిరుగుబాటు చేసి షిండే వర్గానికి చెందిన శివసేన అభ్యర్థుల కు పోటీగా నామినేషన్లు దాఖలు చేసారు. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్వయంగా రెబల్ నేతలను ఒప్పించే పనిలో ఉన్నారు. అజిత్ పవార్ గ్రూపు ఎన్‌సీపీ ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది.
చివరి ప్రయత్నాలు
ఇక, అటు మహా వికాస్ అఘాడీ సైతం రెబల్స్ పోరు ఎదుర్కోంటోంది. కాంగ్రెస్ నుంచి నలుగురు రెబల్స్ గా నామినేషన్లు దాఖలు చేసారు. ప్రస్తుతం రెబల్ నేతలకు నచ్చజెప్పేందుకు ఆ పార్టీ శ్రేణులు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన శివసేన తిరుగుబాటు నేత మన్‌ఖుర్డ్ శివాజీ నగర్ సీటుపై నామినేషన్ దాఖలు చేయడం ద్వారా టెన్షన్ మదలైంది. ఇలా .. రెండు కూటముల నుంచి రెబల్స్ ను విత్ డ్రా చేయించేందుకు అన్ని అస్త్రాలను ముఖ్య నేతలు ప్రయోగిస్తున్నారు. సోమవారం మధ్నాహ్నం తుద గడవు కావటంతో వీరి విషయంలో ఉత్కంఠ పెరిగిపోతోంది. వీరు రెబల్స్ గా బరిలో కొనసాగితే...ఫలితం పైన ప్రభావ పడటం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications