హలోబ్రదర్, క్లోజ్ ఫ్రెండ్స్, అమ్మాయి విషయంతో తమ్ముడిని చంపిన అన్న, మ్యాటర్ !

చెన్నై/తిరునల్వేలి: సొంత అన్నదమ్ములు చిన్నప్పటి నుంచి కలసిమెలసి చాలా సంతోషంగా జీవించారు. పేరుకు అన్నదమ్ములే కాని ఇద్దరూ స్నేహితులుగా ఉండేవాళ్లు. ఎక్కడికి వెళ్లాలి అనుకున్నా ఇద్దరూ కలిసే వెళ్లేవారు. అయితే ఓ అమ్మాయి విషయంలో 27 ఏళ్లుగా చాలా సంతోషంగా జీవించిన అన్నదమ్ముల ఇద్దరి మద్య తేడా వచ్చింది.

ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉందామని అనుకున్న తమ్ముడిని అతని అన్న దారుణంగా హత్య చేశాడు. తమ్ముడి భార్య రోడ్డుపాలు కావడంతో అన్న జైలుపాలైనాడు. అయితే ఆ అమ్మాయి విషయం గురించి తమ్ముడు అతని అన్న దగ్గర దాచిపెట్టడం, ఆ విషయంలోనే రెచ్చిపోయిన అన్న అతని తమ్ముడిని దారుణంగా హత్య చెయ్యడంతో ఆ ఇంట్లో విషాదచాయలు నెలకొన్నాయి.

girlcheatingboyfriend

తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలోని రాధాపురం సమీపంలోని వెల్లూరు ఇలయనారుకులం వడకూర్ ప్రాంతంలో థాను సెల్వం, అతని తమ్ముడు అయ్యప్పన్ నివాసం ఉంటున్నారు. పేరుకు అన్నదమ్ములే కాని ఇద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ లా ఉంటారు. ఇదే సమయంలో అయ్యప్పన్ అనితా అనే యువతిని ప్రేమించాడు.

ప్రతి విషయాన్ని అన్న థాను సెల్వతో షేర్ చేసుకుంటున్న అయ్యప్పన్ అతని ప్రియురాలు అనితా ఈ విషయాన్ని చాలా సీక్రేట్ గా పెట్టాడు. కుటుంబ సభ్యులు, అన్న సెల్వకు ఏమాత్రం తెలీకుండా 2017లో అయ్యప్పన్ అతని ప్రియురాలు అనితాను పెళ్లి చేసుకుని నేరుగా ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో తమ్ముడు తీరుతో సెల్వా రగిలిపోయాడు.

deadbody21

నాకు తెలీకుండా, నాకు పెళ్లి కాకుండా నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావు అంటూ సెల్వా అతని తమ్ముడు అయ్యప్పన్ తో గొడవపడ్డాడు తరువాత కొన్ని రోజులకు నాకు పెళ్లికాకుండానే నువ్వు పెళ్లి చేసుకుంటావా అంటూ సెల్వా అతని తమ్ముడు అయ్యప్పన్ ను దారుణంగా నరికి చంపేశాడు. తమ్ముడు అయ్యప్పన్ హత్య కేసులో సెల్వాను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు.

అప్పటి నుంచి కేసు విచారణ జరుగుతోంది. తనకంటే తమ్ముడు అయ్యప్పన్ ముందుగా పెళ్లి చేసుకున్నాడని కోపంతో సెల్వా అతని తమ్ముడిని దారుణంగా హత్య చేశాడని కోర్టు విచారణలో వెలుగు చూసింది. తమ్ముడు అయ్యప్పన్ ను దారుణంగా హత్య చేసిన సెల్వాకు యావజ్జీవ కారాగార శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విదిస్తూ తిరునల్వేలి మూడవ అదనపు స్పెషల్ కోర్టు తీర్పు చెప్పింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+