కంబళ పోటీల్లో సరికొత్త చరిత్ర.. 10.87 సెకన్లలో..

కర్ణాటక లో ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కంబళ పోటీల్లో(దున్నపోతుల పందెం) ఈ సారి సరికొత్త రికార్డు నమోదైంది. మంగళూరులోని బంగ్రా కూలూర్ గోల్డ్ ఫించ్ సిటీలో జరిగిన కంబళ పోటీల్లో మస్తీకట్టే స్వరూప్ అనే యువకుడు నయా రికార్డును నెలకొల్పాడు. అంతకుముందు శ్రీనివాస్ గౌడ పేరు మీద ఉన్న రికార్డును అధిగమించాడు. ఈ పోటీల్లో కేవలం 10.87 సెకన్లలో.. 125 మీటర్లు.. పరిగెత్తి కంబళ పోటీల్లోనే సరికొత్త రికార్డును నెలకొల్పాడు. దీంతో స్వరూప్ పై సర్వత్రా ప్రశంసలు అందుతున్నాయి.

ఈ ఏడాది దక్షిణ కన్నడ జిల్లాలోని మంగళూరులో కంబళ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలు శనివారం ప్రారంభం కాగా ఆదివారం ముగిశాయి. ఈ గ్రామీణ క్రీడా పోటీల్లో యువకుడు మస్తీకట్టే స్వరూప్ తన ప్రతిభ కనబరిచాడు. కేవలం 10.87 సెకన్లలో.. 125 మీటర్లు దున్నపోతులతో పరుగెత్తి సరికొత్త రికార్డును నెలకొల్పాడు. గతంలో కంబళ పోటీల్లో శ్రీనివాస్ గౌడపై రికార్డు ఉంది. శ్రీనివాస్ గౌడ 8.78 సెకన్లలో పూర్తి చేయగా.. తాజాగా స్వరూప్ 100 మీటర్లను 8.69 సెకన్లలోనే అధిగమించాడు. దీంతో కంబళ పోటీల్లో నయా రికార్డు నెలకొల్పాడు. బడగబెట్టు సందీప్ శెట్టికు చెందిన దున్నపోతులు ఈ రికార్డును నమోదు చేశాయి.

ఇక కంబళ కమిటీ యువ క్రీడాకారుడు స్వరూప్ ను సత్కరించింది. ఈ విజయంపై స్వరూప్ ఆనందం వ్యక్తం చేశాడు. గత మూడేళ్లుగా కంబళా దున్నపోతుల వెంట పరుగెత్తుతున్నాను. గతేడాది నేను జూనియర్ కేటగిరీలో పాల్గొన్నాను. ఈ ఏడాది తొలిసారిగా సీనియర్ డివిజన్ పోటీలో పాల్గొన్నాను. సీనియర్ కేటగిరీలో మూడు కంబళ పోటీల్లో పాల్గొన్నాను. ఈ పోటీల్లో సరికొత్త రికార్డు నెలకొల్పడం ఆనందంగా ఉంది.

అలాగే దున్నపోతుల యజమాని సందీప్ శెట్టి మాట్లాడుతూ.. స్వరూప్ కు మంచి భవిష్యత్తు ఉందని అన్నాడు. ఈ విజయంలో నా దున్నపోతులు, స్వరూప్ పాలు పంచుకోవడం ఆనందంగా ఉంది. స్వరూప్ తొలిసారి సీనియర్ కేటగిరీలో పాల్గొన్నాడు. ఈ విజయం అనుకోలేదు.. అని తెలిపాడు.

Lightning Fast Young Jockey Mastikatte Swaroop Sets New All-Time Kambala Record in 10 87 Seconds

ఇక ఇదే విషయంపై కంబాళా కమిటీ ఛైర్మన్ దేవిప్రసాద్ శెట్టి ఆనందం వ్యక్తం చేశారు. ఈ గ్రామీణ క్రీడలో దున్నపోతులు వారి మాస్టర్స్ చెప్పినట్టుగా పరిగెత్తుతాయి. గతంలో ఈ రికార్డు శ్రీనివాస్ గౌడ మీద ఉంది. ఇప్పడు ఆ రికార్డును స్వరూప్ బద్దలుకొట్టాడు. అతడు 100 మీటర్లను 8.69 సెకన్లలోనే సాధించాడు. ఇది కంబాళా పోటీల్లో చరిత్ర.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+