రద్దీ రహదారిపై సింహాల గుంపు హల్చల్ (వీడియో)
గాంధీనగర్: గుజరాత్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పులులు, సింహాలు ఎక్కువగా ఉంటాయనే విషయం తెలిసిందే. అయితే, ఇతర రాష్ట్రాల్లో కుక్కలు రోడ్లపై గుంపులుగా తిరిగినట్లు ఇక్కడ సింహాలు రద్దీ రహదారులపై తిరగడం గమనార్హం. ఓ వైపు వాహనాలు రాకపోకలు సాగిస్తున్నప్పటికీ.. తమకేం పట్టనట్లు సింహాలు రోడ్లపై తిరుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.
గుజరాత్‌లోని అమ్రేలి జిల్లాలో పిపావావ్ పోర్ట్ హైవేను దాటుతున్న సింహాల గుంపు, ఆమె పిల్లలు బంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఆదివారం అర్థరాత్రి జరిగిన సంఘటన ట్రక్కు డ్రైవర్లు, ప్రయాణీకులలో భయాందోళనలకు గురయ్యారు. ఒక సింహం, దాని పిల్లలు రద్దీగా ఉన్న రహదారిపై అటు ఇటూ తిరిగి రోడ్డు దాటాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

కాగా, సింహాల గుంపును చూసి ఓ బైకర్ వెంటనే అక్కడ్నుంచి యూటర్న్ తీసుకున్నాడు. ఈ సంఘటన అమ్రేలీ తీర ప్రాంతంలో సింహాల ఉనికిని హైలైట్ చేస్తుంది. ఈ ప్రాంతం సింహాల మనుగడకు మరింత అనుకూలమైనది కానీ మానవ-వన్యప్రాణుల సహజీవనానికి సవాళ్లను కలిగిస్తోంది.
గుంపులుగా సింహాలు రద్దీ రహదారిపై తిరుగుతుండటంతో వాటికి ప్రమాదాలు జరిగే అవకాశం కూడా లేకపోలేదని ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు, ద్విచక్ర వాహనదారుల ప్రాణాలు కూడా ముప్పు ఉండే అవకాశం ఉందని ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. సింహాలకు సంబంధించిన ప్రమాదాల సంఖ్య పెరుగుతుండడంతో అటవీ శాఖ రాత్రిపూట దాటే సమయంలో సింహాలు, మానవుల భద్రత గురించి ఆందోళన చెందుతోంది.
#WATCH | A #lioness and her cubs casually cross the Pipavav Port highway in Amreli district, #Gujarat. This has sparked concerns about lion-human interactions and highway safety.#IndiaNews #viralvideo pic.twitter.com/Pj1nhRlvEw
— Free Press Journal (@fpjindia) February 5, 2024
"కోస్టల్ బెల్ట్‌లో సింహాల ఉనికి కొత్త పరిణామం" అని అటవీ అధికారి ఒకరు తెలిపారు. "గిర్ జాతీయ ఉద్యానవనం వారి ప్రాథమిక నివాసంగా ఉన్నప్పటికీ.. ఇతర ప్రాంతాలకు వాటి విస్తరణ మానవులు, సింహాల భద్రతను నిర్ధారించడానికి చురుకైన చర్యలు అవసరం' అని పేర్కొన్నారు. ఈ ఘటన మొదటిదేమీ కాదు. అమ్రేలిలోని వివిధ రహదారులపై సింహాలు ఎక్కువగా కనిపిస్తాయి. వాటి ఉనికి అనేక వైరల్ వీడియోలు వచ్చాయి.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications