వైరల్ వీడియో: బెంగళూర్ ఇంత కాస్ట్లీనా.. అద్దె రూ. 1.25 లక్షలు..
బెంగళూరులో నివసిస్తున్న విదేశీ మహిళ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. బెంగళూరులో ఆమె ఇంటి అద్దె రూ. 1.25 లక్షలు అలాగే హౌజ్ హెల్ప్ కు నెలకు రూ. 45 వేలు అని పేర్కొంది. గత దశాబ్దం నుంచి ఆమె భారత్ లో నివసిస్తోంది. ఈ మేరకు భారత్ తో తనకున్న అనుబంధాన్ని ఈ వీడియోలో పంచుకుంది. తనకు బెంగళూరులో నెలకు రూ. 75 వేలు ఖర్చు వస్తుందని.. స్కూల్ కు మరో రూ.30 వేలు చెల్లిస్తానని పేర్కొంది. కంటెంట్ క్రియేటర్ యూలియా ఈ మేరుకు భారత్ లో తన అనుభవాలను ఇన్ స్టా వీడియోలో పంచుకున్నారు.
కంటెంట్ క్రియేటర్ యూలియా.. 11 ఏళ్లుగా బెంగళూరులో ఉంటున్నారు. ఈ మేరకు ఇన్ స్టాలో ఓ వీడియో పోస్టు చేశారు. బెంగళూరులో జీవించడానికి ఎంత ఖర్చు అవుతుంది అనే విషయంపై వీడియోలో తన అనుభవాలను పంచుకున్నారు. " 11 సంవత్సరాల క్రితం వర్క్ ప్రాజెక్ట్ లో భాగంగా నేను రష్యా నుంచి బెంగళూరుకు వచ్చాను. అప్పుడు నాకు ప్రతి విషయం సాధారణంగానే కనిపించింది. నా సొంత దేశంలో కరెన్సీ దృఢంగా ఉంది. అందుకే నేను అన్ని ధరలను సగంగా డివైడ్ చేశాను.
" హెచ్ఎస్ఆర్ ప్రాంతంలో గేటెడ్ కమ్యూనిటీలోని 2 బీహెచ్ కే ఇళ్లు ఇప్పటికీ నాకు గుర్తుంది. అన్ని సదుపాయాలు కలిపి ఈ ఇళ్లు రెంట్ రూ. 25 వేలుగా ఉంది. అక్కడి నుంచి క్యాబ్స్ రూ. 700 ఉండేది. ఈ వీడియోలో ఆమె ప్రస్తుతం తన ఖర్చులను వివరించారు. ఇంటి అద్దె రూ. 1,25,000 గా ఉంది. స్కూల్ రూ. 30,000.. ఫుడ్ ఇతర ఇంటి ఖర్చులు రూ. 75,000.. హౌజ్ హెల్ప్ రూ. 45,000.. హెల్త్ అండ్ ఫిట్ నెస్ రూ. 30,000.. పెట్రోల్ రూ. 5,000 గా ఉన్నాయి.

" నా నెలవారీ ఖర్చులు మారుతూ ఉంటాయి. ఇక నా సొంత ఖర్చులు రూ. 25 నుంచి రూ. 35 వేల వరకు ఉన్నాయి. బెంగళూరులో ముగ్గురు ఉన్న కుటుంబానికి రూ. 2.5 లక్షలు ఖర్చు వస్తుంది. ఇది తక్కువే. గురుగ్రామ్, ముంబైలో ఖర్చు ఇంకాస్త ఎక్కువ అని విన్నాను" అని తన ఇన్ స్టా వేదికగా యూలియా చెప్పుకొచ్చింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో నెటిజెన్లు పలు రకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. మీకు రావాల్సిన దానికంటే ఎక్కువ జీతం తీసుకొంటున్నారని కొందరు కామెంట్స్ పెడుతున్నారు. మరొకరు కామెంట్స్ చేస్తూ నేను బెంగళూలో 20 ఏళ్ల నుంచి ఉంటున్నాను.. మీరు పెట్టిన ఖర్చులో సగం కూడా పెట్టలేదన్నారు.












Click it and Unblock the Notifications