lockdown:రేషన్ కోసం పేదల క్యూ, రోడ్డు బ్లాక్ చేశారన్న పోలీసులు.. డిష్యూం, డిష్యూం..(వీడియో)
కరోనా వైరస్ పుణ్యమా అని పేదలకు చేసేందుకు పనిలేదు. దీంతో ప్రభుత్వం అందజేసే రేషన్‌తో కడుపు నింపుకోవాల్సిన పరిస్థితి. కానీ కొన్నిచోట్ల రేషన్ సరిగా ఇవ్వకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పశ్చిమబెంగాల్ 24 పరగణాస్ జిల్లాలో అధికారుల తీరుతో.. ప్రజలు కోపోద్రిక్తులయ్యారు. దీంతో స్థానికులు పోలీసుల మధ్య ఘర్షణకు దారితీసింది.
ఉత్తర 24 పరగణ జిల్లా బదురియాలో అధికారులు సరిగా రేషన్ పంపిణీ చేయలేదు అని స్థానికులు ఆరోపించారు. కానీ పోలీసుల వెర్షన్ మరోలా ఉంది. స్థానికులు రోడ్డు బ్లాక్ చేశారని, రోడ్డుపై వెళ్లేందుకు జాగా ఇవ్వాలని పోలీసులు చెప్పారు. ఇందుకు స్థానికులు నిరాకరించడంతో గొడవ జరిగింది.

అయితే ఏఎన్ఐ వార్తాసంస్థ పోస్ట్ చేసిన వీడియాలో మహిళా కర్ర తీసుకొని పోలీసుల మీదకు వచ్చే దృశ్యం కనిపిస్తోంది. పోలీసులు కూడా ఆమెపై దాడి చేసేందుకు వెళ్లారు. మిగతావారు కూడా పోలీసులతో గొడవపడ్డారు. రాళ్లు విసిరిన విజువల్, హెల్మెట్ పెట్టుకున్న పోలీసులపై దాడిచేసిన ఫుటేజీ కూడా కనిపించింది. పోలీసులు-స్థానికుల మధ్య గొడవకు సంబంధించి ఫుటేజీ సాక్ష్యంగా నిలుస్తోంది.
పశ్చిమ బెంగాల్‌లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 423కి చేరింది. వీరిలో 335 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. 73 మంది డిశ్చార్జ్ అయ్యారు. 15 మంది చనిపోయారని బెంగాల్ వైద్యారోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు.
#WATCH: Locals clash with Police personnel after they (locals) had blocked the road alleging improper distribution of ration material amid #CoronavirusLockdown in Baduria, North 24 Parganas. #WestBengal pic.twitter.com/ceuxq6mcEl
— ANI (@ANI) April 22, 2020
Recommended Video
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications