Lockdown: బీరు బాటిల్ చూడగానే కళ్లు తిరిగిపడిపోయిన యువతి, మాతల్లే, ఎంత త్యాగం చేశావ్ ? గ్రేట్!

బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) కట్టడి కోసం దేశం మొత్తం లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. రెండో విడత లాక్ డౌన్ గడువు ఆదివారం అర్దరాత్రితో ముగిసింది. మూడో విడత లాక్ డౌన్ ఈనెల 17వ తేదీ వరకు పొడగించారు. అయితే మద్యం విక్రయాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. సోమవారం వేకువ జామున నుంచి దేశవ్యాప్తంగా బ్రాందీ షాపుల ముందు మందుబాబులు క్యూ కట్టారు.

పురుషుల కంటే మేమేం తక్కువ అంటూ కొన్నిచోట్ల యువతులు, మహిళలు బ్రాందీ షాపుల ముందు క్యూ కట్టారు. బెంగళూరు నగరంలోని ఓ బ్రాందీ షాప్ ముందు క్యూలో నిలబడిన యువతి లిక్కర్ తాగక ముందే బీరు బాటిల్ చూసి కళ్లు తిరిగి కుప్పకూలిపోయింది. ఏం జరిగింది ? అంటూ అక్కడున్న వారు, పోలీసులు ఆరా తియ్యగా ఆ మహాతల్లి చెప్పిన సమాధానం విని మా తల్లే ఎంత త్యాగం చేశావ్ ? అన్నారు. యువతి చెప్పిన మాటలు విని మందుబాబులకు షాక్ తగిలి వారి కళ్లు గిర్రున తిరిగిపోయాయి.

 గోవిందా గోవిందా

గోవిందా గోవిందా

దేశ వ్యాప్తంగా సోమవారం బ్రాందీ షాపులు తెరుచుకున్నాయి. శివకుడికి ఎంతో పవిత్రమైన రోజు సోమవారం బ్రాందీ షాపులు తియ్యడంతో కొందరు ఓం నమ: శివాయ అంటూ లిక్కర్ షాప్ ల ముందు బారులుతీరారు. కొందరు ఏకంగా గోవిందా గోవిందా అంటూ బ్రాందీ షాపుల ముందు క్వాటర్ బాటిల్స్ కొనుగోలు చెయ్యడానికి పోటీపడ్డారు.

బెంగళూరు ఎంజీ రోడ్డు అంటే మాటలా?

బెంగళూరు ఎంజీ రోడ్డు అంటే మాటలా?

బెంగళూరు పేరు తెలిసిన వారికి ఆ సిటీలోని ఎంజీ పేరు పెద్దగా పరిచయం చెయ్యాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఎంజీ రోడ్డు లగ్జరీ లైఫ్ కు పెట్టిందిపేరు. ఎంజీ రోడ్డులో ఖరీదైన దుస్తులు, వస్తువులు అందుబాటులో ఉంటాయి. ఎంజీ రోడ్డులో విలాసవంతమైన పబ్ లు, బార్ అండ్ రెస్టారెంట్లు, బ్రాందీ షాపులు, మాల్స్ ఉన్నాయి.

లిక్కర్ షాపు ముందు కుప్పకూలిన యువతి

లిక్కర్ షాపు ముందు కుప్పకూలిన యువతి

బెంగళూరులోని ఎంజీ రోడ్డులోని టానిక్ వైన్ షాప్ ఉంది. సోమవారం ఉదయం నుంచి ఎంజీ రోడ్డులోని టానిక్ వైన్ షాప్ ముందు మద్యం కొనుగోలు చెయ్యడానికి వందల మంది క్యూలో నిలబడి ఉన్నారు. మందుబాబులు నిలబడిన క్యూ లైన్ లో కొందరు యువతులు నిలబడి ఉన్నారు. క్యూ లైన్ ముందుకు కదులుతున్న సమయంలో అక్కడ ఉన్న ఓ యువతి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.

మాతల్లే, ఎంత త్యాగం చేశావ్!

మాతల్లే, ఎంత త్యాగం చేశావ్!

టానిక్ వైన్ షాప్ ముందు క్యూలో నిలబడి ఉన్న మందుబాబులు, అక్కడ ఉన్న పోలీసులు యువతి కింద పడిపోయిన విషయం గుర్తించారు. వెంటనే ఓ కుర్చిలో ఆ యువతిని కుర్చోబెట్టారు. సమీపంలోని ఓ షాప్ లో మంచినీళ్ల బాటిల్ తీసుకు వచ్చి ఆయువతితో తాగించారు. అమ్మా, ఏం జరిగింది ? ఎందుకు పడిపోయావు ? అంటూ అక్కడ ఉన్న వాళ్లు ప్రశ్నించారు. ఆ సమయంలో ఆ యువతి చెప్పిన మాటలు విన్న మందుబాబులు, పోలీసులు మాతల్లే, ఎంత త్యాగం చేశావ్ ? అంటూ షాక్ కు గురైనారు.

Recommended Video

    Andhra Pradesh Govt to Hike Liquor Prices By 25 Percent | Onewindia Telugu

    అంత అవసరమా తల్లి?

    40 రోజుల నుంచి లిక్కర్ షాప్ లు, పబ్ లు, బార్ అండ్ రెస్టారెంట్లు మూతపడిన విషయం తెలిసిందే. సోమవారం నుంచి మద్యం విక్రయిస్తారని మాకు తెలిసిందని, ఎక్కడ మద్యం చిక్కుతుందో ? చిక్కదో ? అనే భయంతో టిఫిన్ కూడా చెయ్యకుండా వేకువ జామున స్నేహితులతో కలిసి క్యూలైన్ లో నిలబడ్డానని, అందుకే తనకు కళ్లు తిరిగాయని ఆ యువతి సమాధానం చెప్పడంతో మందుబాబులు షాక్ కు గురైనారు. అమ్మా తల్లి నీకు మందు అంత అవసరమా ? అంటూ పోలీసులు, మందుబాబులు యువతిని ప్రశ్నించారు. ఇంత జరిగినా ఆ యువతి కొంచెం కోలుకున్న తరువాత మళ్లీ టానిక్ వైన్ షాప్ ముందు క్యూలో నిలబడటంతో మందుబాబులకు మరోసారి కళ్లు తిరిగిపోయాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+