• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Lockdown: మందు కావాలంటే ఆధార్ కార్డు ఉండాలి, ఓటర్ ఐడీ, రేషన్ కార్డుకు రెఢీ, నాదారి రహదారి, ఓకే !

|

చెన్నై: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారిని అరికట్టడంలో భాగంగా లాక్ డౌన్ అమలు చెయ్యడంతో దాదాపు 90 శాతం అన్ని వ్యాపార లావాదేవీలు మూపడ్డాయి. లాక్ డౌన్ దెబ్బకు మద్యం షాపులు మూసివేశారు. లాక్ డౌన్ మూడోసారి పొడగించిన సమయంలో కేంద్ర ప్రభుత్వం మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చింది. మూడు రోజుల పాటు తర్జనబర్జన పడిన తమిళనాడు ప్రభుత్వం చివరికి మద్యం విక్రయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే మద్యం కొనుగోలు చెయ్యడానికి తమిళనాడు ప్రభుత్వం కొన్ని షరతులు విధించడంతో మందుబాబులు షాక్ తిన్నారు. మద్యం విక్రయాలు వయసును బట్టి ఆధార్ కార్డు చూపించిన వారికే విక్రయిస్తున్నారు. మీరు ఆధార్ కార్డు కాదుకదా ఓటర్ ఐడీ, రేషన్ కార్డు ఇవ్వమన్నా ఇస్తాం, నాదారి రహదారి అంటున్నారు మందుబాబులు. మందుబాబులకు ముందుగా టోకన్లు ఇస్తున్నారు. ఇన్ని నియమాలు పెట్టినా గురువారం ఒక్కరోజు దాదాపు రూ. 150 కోట్లకు పైగా విలువైన మద్యం విక్రయించామని ఓ అధికారి అంటున్నారు.

Lockdown: లవ్ మ్యారేజ్, కేరళలో భర్త, బెడ్ రూంలో ప్రియుడు, కరోనా పరీక్షలు చేసిన గంటలో ఫినిష్ !

లాక్ డౌన్ దెబ్బకు నోట్లో తడారిపోయింది

లాక్ డౌన్ దెబ్బకు నోట్లో తడారిపోయింది

కరోనా వైరస్ కట్టడి కోసం దేశం మొత్తం లాక్ డౌన్ విదించడంతో లిక్కర్ వ్యాపారానికి పూర్తిగా బ్రేకులు పడ్డాయి. 44 రోజుల పాటు బ్రాందీ, బీరు, విస్కీ చిక్కకపోవడంతో మందుబాబుల నోట్లో తడారిపోయింది. కేంద్ర ప్రభుత్వం మద్యం విక్రయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా రెండు రోజుల పాటు తమిళనాడులో లిక్కర్ షాప్ లో తెరుచుకోలేదు. ఈ దెబ్బకు మందుబాబులు ఇంకా ఎక్కువ ఆందోళనకు గురైనారు.

ఆధార్ కార్డ్, వారానికి రెండు సార్లు

ఆధార్ కార్డ్, వారానికి రెండు సార్లు

తమిళనాడులో మద్యం కొనుగోలు చెయ్యాలంటే చాలా నిబంధనలు ఉన్నాయి. మద్రాసు హైకోర్టు ఆదేశాలను తమిళనాడు ప్రభుత్వం పాటిస్తోంది. మద్యం కొనుగోలు చేసే వ్యక్తి తప్పనిసరిగా మాస్కు పెట్టుకుని వెంట ఆధార్ కార్డు తీసుకెళ్లాలి. వారానికి రెండు సార్లు మాత్రమే ఒక్కోవ్యక్తి లిక్కర్ కొనుగోలు చెయ్యడానికి అవకాశం ఇస్తున్నామని తమిళనాడు ప్రభుత్వం స్పష్టం చేసింది. హోల్ సేల్ విక్రయాలు ఉండకూడదని, బార్ అండ్ రెస్టారెంట్లు తియ్యకూడదని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. ఒక్క వ్యక్తి ఎక్కువ మద్యం కొనుగోలు చెయ్యడానికి అవకాశం ఇవ్వకుండా చూడటానికే ఆధార్ కార్డు తప్పనిసరి చేశారు. అయితే ఆధార్ కార్డు కాదుకదా ఓటర్ ఐడీ, రేష్ కార్డు తీసుకురమ్మని చెప్పినా తీసుకురావడానికి మేము సిద్దంగా ఉన్నామని మందుబాబులు అంటున్నారు.

వయసుల వారిగా లిక్కర్ టైం టేబుల్

వయసుల వారిగా లిక్కర్ టైం టేబుల్

తమిళనాడులో మద్యం కొనుగోలు చెయ్యాలంటే టైంటేబుల్ పాటించాలి. వయసుల వారిగా మద్యం విక్రయించాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. 50 ఏళ్లు పైబడిన వారు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, 40-50 ఏళ్ల మద్య వయసు ఉన్న వారు మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు, 40 ఏళ్ల లోపు వయసు ఉన్న వాళ్లు మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల్లోగా మద్యం కొనుగోలు చెయ్యాలని తమిళనాడు ప్రభుత్వం సూచించింది.

ఒక్క మనిషికి ఎంత లిక్కర్ అంటే ?

ఒక్క మనిషికి ఎంత లిక్కర్ అంటే ?

ఒక్క మనిషి ఒక్కసారి 750 మి.లీ. మద్యం కొనుగోలు చెయ్యడానికే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆధార్ కార్డ్ చూపించిన తరువాతే మద్యం ఇస్తున్నారు. అంతే కాకుండా ఎక్కపడితే అక్కడ మద్యం సేవించకూడదని, ఇళ్లలోనే మద్యం సేవించాలని మద్రాసు హైకోర్టు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. మూడు పొరలు ఉన్న మాస్కులు వేసుకుని, జోబులో ఆధార్ కార్డు పెట్టుకుని వెళ్లిన వ్యక్తులకు మాత్రమే మద్యం బాటిల్స్ ఇస్తున్నామని తమిళనాడు టాస్మాక్ (ప్రభుత్వం) మేనేజింగ్ డైరెక్టర్ ఆర్. క్రిలోష్ కుమార్ తెలిపారు.

నేరాలు, ఘోరాలు

నేరాలు, ఘోరాలు

44 రోజుల తరువాత ఒక్కసారిగా మద్యం షాపులు తెరుచుకోవడంతో మద్యం సేవించడానికి మందుబాబులు ఎగబడుతున్నారు. మద్యం మత్తులో నేరాలు, ఘోరాలు, రోడ్డు ప్రమాదాలు జరకుండా ఉండటానికే ఒక్క వ్యక్తికి మూడు రోజులకు ఒక్కసారి 750 మి.లీ. మద్యం విక్రయించాలని నియమాలు పెట్టామని, ఆధార్ కార్డ్ తప్పకుండా ఎంట్రీ చెయ్యాలని నియమాలు పెట్టామని టాస్మాక్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిలోష్ కుమార్ స్పష్టం చేశారు.

మీరు ఎన్ని రూల్స్ పెట్టినా మా దారి రహదారి

మీరు ఎన్ని రూల్స్ పెట్టినా మా దారి రహదారి

మీరు ఎన్ని నియమాలు పెట్టినా మేము మాత్రం వెనక్కి తగ్గమని మందుబాబులు అంటున్నారు ఆధార్ కార్డు కాదుకదా రేషన్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు తీసుకురమ్మని చెప్పినా తాము కచ్చితంగా తీసుకువస్తామని మందుబాబులు అంటున్నారు. మద్యం దుకాణాలు ఒక్కసారిగా రీ ఓపెన్ కావడంతో గురువారం ఒక్కరోజు మాత్రమే సుమారు. 150 కోట్లకు పైగా విలువైన మద్యం విక్రయాలు జరిగాయని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.

 లిక్కర్ కోసం టోకన్లు జారీ

లిక్కర్ కోసం టోకన్లు జారీ

మద్యం కొనుగోలు చెయ్యడానికి, మందుబాబుల కోసం తమిళనాడు ప్రభుత్వం టోకన్లు జారీ చేస్తోంది. టస్మాక్ షాప్ ల ముందు రద్దీని తగ్గించాలని, అందరూ సమాజిక దూరం పాటించాలని ఉద్దేశంతో ఆన్ లైన్ లో నగదు చెల్లించడానికి అవకాశం ఇచ్చారు. అంతే కాకుండా మద్యం ప్రియులకు ముందుగా టోకన్లు జారీ చేసి ఓ టైం చెప్పిన తరువాతే మద్యం కొనుగోలు చెయ్యడానికి అవకాశం ఇస్తున్నామని తమిళనాడు ప్రభుత్వం అంటోంది. మొత్తం మీద ఎన్ని నియమాలు పెట్టినా తమిళనాడులో ఒక్కరోజులో రూ. 150 కోట్ల విలువైన లిక్కర్ విక్రయించారని వెలుగు చూడటంతో చాల మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

English summary
Lockdown: Tamil Nadu Govt has introduced the Aadhar card Token System, Online payment in TASMAC Liqour Shops.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X