Kerala Survey: కేరళలో గెలిచేది వాళ్లే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..!
కేరళ (kerala)లో ఈ నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎల్డీఎఫ్ (LDF), విపక్ష యూడీఎఫ్ (UDF),జాతీయ పార్టీ బీజేపీ మధ్య పోరు నెలకొంది. అయితే వాస్తవానికి ఇక్కడ జరుగుతోంది ఎల్పీఎఫ్, యూడీఎఫ్ మధ్య ముఖాముఖీ పోరే. ఎందుకంటే బీజేపీ పాత్ర నామమాత్రమే. ఈసారి ఎన్నికల్లోనూ అదే పరిస్ధితి. దీంతో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ లలో ఓటర్లు ఈసారి ఎవరిని ఆదరిస్తున్నారనే దానిపై పలు సర్వే సంస్థలు అభిప్రాయ సేకరణలు చేస్తున్నాయి. ఇదే క్రమంలో లోక్ పోల్ (lok poll) సంస్థ కూడా తమ సర్వే ఫలితాలను ప్రకటించింది.
140 సీట్లు ఉన్న కేరళ అసెంబ్లీకి ఈ నెల 9న జరిగే ఎన్నికల్లో ఎల్డీఎఫ్-యూడీఎఫ్ మధ్య గట్టి పోటీ నెలకొంది. ఈ ఉత్కంఠ భరిత పోరులో ఈసారి ఎల్డీఎఫ్ కు నిరాశ తప్పదని లోక్ పోల్ సర్వేలో వెల్లడైంది. విపక్ష యూడీఎప్ 77-81 సీట్లు సాధించి అధికారంలోకి రావడం ఖాయమని లోక్ పోల్ సర్వే తెలిపింది. అధికార ఎల్డీఎఫ్ కు 58-62 సీట్లు మాత్రమే దక్కుతాయని తెలిపింది. అలాగే ఎన్డీయేకు 1-2 సీట్లు మాత్రమే లభించే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది.

ఎల్డీఎఫ్ కు 39-41 శాతం మంది ఓటర్ల మద్దతు లభిస్తోందని లోక్ పోల్ సర్వేలో తేలింది. అలాగే యూడీఎఫ్ కు 42-44 శాతం మంది మద్దతు లభిస్తున్నట్లు తెలిపింది. ఇక ఎన్డీయేకు కేవలం 14-16 శాతం మంది ఓటర్ల మద్దతు ఇస్తున్నట్లు లోక్ పోల్ తేల్చింది. మార్చి 14 నుంచి 31 మధ్య ఈ సర్వే నిర్వహించినట్లు లోక్ పోల్ తెలిపింది. ఇందులో ప్రతీ నియోజకవర్గం నుంచి ర్యాండమ్ గా తీసుకున్న 36400 మంది ఓటర్ల అభిప్రాయాల ఆధారంగా ఈ సర్వే ఫలితాలను ప్రకటిస్తున్నట్లు లోక్ పోల్ వెల్లడించింది.












Click it and Unblock the Notifications