Viral Video:ఎయిరిండియా ఫ్లైట్ పేలిపోతుంటే.. పొగల్లో నుంచి కూల్ గా..! తాజా వీడియో..

గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఉన్న సర్దార్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన ఐదు నిమిషాలకే కుప్పకూలిన ఎయిర్ ఇండియా బోయింగ్ ఏఐ171 విమానంలో ఒకే ఒక్క ప్రయాణికుడు బతికి బయటపడ్డాడు. నిజమా కలా అనేలా జరిగిన అద్బుతంలో నుంచి అతను బయటపడ్డ తీరు అందరినీ నివ్వెరపోయేలా చేసింది. చివరికి ప్రధాని మోడీ కూడా అతన్ని ఆస్పత్రికి వచ్చి పరామర్శించారు. అయితే ఆ రోజు ఘటనలో అతను బయటికి వస్తున్న మరో వీడియో దొరికింది.

ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం టేకాఫ్ అయిన ఐదు నిమిషాల్లోనే పక్కనే ఉన్న మెడికల్ కాలేజ్ హాస్టల్ పై కుప్పకూలడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. క్షణాల్లో జరిగిపోయిన ఈ ఘటనతో చుట్టుపక్కల ఉన్న వారంతా షాకయ్యారు. భయంతో హాహాకారాలు చేశారు. భయంతో కాసేపు వణికిపోయారు. పేలిపోతున్న ఫ్లైట్ ను చూస్తూ ఉండిపోయారు. అదే సమయంలో ఆ పొగలు, మంటల మధ్యలో నుంచి ఓ యువకుడు బయటికి వస్తూ వారికి కనిపించాడు.

lone survivor of air india plane crash vishwas kumar s latest videos gone viral

దీంతో స్ధానికులు మొదట షాకై అరుపులు కేకలు పెట్టారు. ఆ తర్వాత అతని దగ్గరికి వెళ్లి తీసుకుని అధికారుల సాయంతో ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత అతనికి ప్రాథమిక చికిత్స చేసిన తర్వాత క్రమంగా కోలుకుంటున్నాడు. ఎయిర్ ఇండియా విమానంలో 11ఏ సీటులో ప్రయాణించిన అతను ఫ్లైట్ ప్రమాదంలో రెండు ముక్కలు కావడంతో ఓ ముక్కలో ఉండిపోయాడు. మరో ముక్క పేలిపోయింది. దీంతో మిగిలిన ముక్కలో నుంచి అతను కిందికి దిగి కూల్ గా నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఆస్పత్రిలో ముందు అతను ఎలా బయటపడ్డాడని అడిగితే ఇదే విషయం చెప్పాడు. కానీ ఎవరూ నమ్మలేదు. కానీ ఇవాళ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు చూసి నమ్మక తప్పలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+