సెక్స్ స్యాండల్ కేసు, రెండోసారి లుక్ ఔట్ నోటీసులు, బిగిస్తున్న ఉచ్చు, హో మంత్రి క్లారిటి !
జేడీఎస్ నేత, హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ, ఆయన తండ్రి, మాజీ మంత్రి హెచ్‌డీ రేవణ్ణలపై అధికారులు రెండో లుక్‌ఔట్ నోటీసులు జారీ చేశారని కర్ణాటక హోమ్ మంత్రి పరమేశ్వర్ తెలిపారు. ప్రజ్వల్ రేవణ్ణ, మాజీ మంత్రి రేవణ్ణలకు రెండోసారి నోటీసులు జారీ చేశామని, శనివారం సాయంత్రంలోగా ఇద్దరూ సిట్ అధికారుల ముందు హాజరై సమాధానం చెప్పాల్సి ఉంటుందని హోంమంత్రి పరమేశ్వర్ తెలిపారు.
శనివారం కర్ణాటక హోం మంత్రి పరమేశ్వర్ మీడియాతో మాట్లాడారు. ఈ వారం ప్రారంభంలో ప్రజ్వల్ రేవణ్ణపై ఫస్ట్ లుక్ ఔట్ సర్క్యులర్ జారీ అయిందని, ఇది రెండో నోటీసు అని పరమేశ్వర్ తెలిపారు. .హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ రికార్డు చేసిన అశ్లీల వీడియోలు ఇప్పటికే హాసన్ జిల్లా, కర్ణాటకతో సహ దేశవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. దీంతో ప్రజ్వల్ రేవణ్ణ విదేశాలకు వెళ్లినట్లు సమాచారం. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ముందు హాజరయ్యేందుకు మరింత సమయం కావాలని ప్రజ్వల్ రేవణ్ణ కోరారు.

అయితే హాసన్ జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అభ్యర్థనను సిట్ అధికారులు తిరస్కరించారు. మాజీ మంత్రి హెచ్‌డీ రేవణ్ణ, ప్రజ్వల్ రేవణ్ణలపై లుకౌట్ నోటీసు జారీ చేశారు. హెచ్‌డీ రేవణ్ణ విదేశాలకు వెళ్లాలని భావించినా లుకౌట్ నోటీసు జారీ చెయ్యడం వలన అది సాధ్యం కాలేదని ఓ అధికారి అంటున్నారు. కానీ శుక్రవారం రెండోసారి మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణకు నోటీసులు జారీ చేశారు. నోటీసులకు సమాధానం ఇవ్వడానికి శనివారం సాయంత్రం వరకు సమయం ఉందని కర్ణాటక హోం మంత్రి పరమేశ్వర్ ఏఎన్ఐ వార్తా సంస్థతో అన్నారు.
బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న మాజీ మంత్రి రేవణ్ణపై ఇప్పుడు మరో కేసు నమోదు అయ్యింది. మైసూర్ జిల్లాలో నివాసం ఉంటున్న మహిళను కిడ్నాప్ చేశారని మాజీ మంత్రి రేవణ్ణ మీద మరో కేసు నమోదు కావడంతో ఆ కేసులో కూడా బెయిల్ కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారని హోం మంత్రి పరమేశ్వర తెలిపారు. మైసూర్‌లో ఓ మహిళను అపహరించి లైంగికంగా వేధించిన ఆరోపణలపై హెచ్‌డీ రేవణ్ణపై ఫిర్యాదు నమోదైంది.
మైసూరు జిల్లాలోని కేఆర్ నగర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తన తల్లి హెచ్‌డీ రేవణ్ణ ఇంట్లో ఆరేళ్లుగా హౌస్ కీపర్‌గా పనిచేస్తూ తిరిగి స్వగ్రామానికి వచ్చిందని, ఇక్కడ దినసరి కూలీగా పనిచేస్తోందని, ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియోలలో నా తల్లికూడా ఉందని, ఆ వీడియోలు లీక్ అయిన తరువాత ఆమె హడలిపోయిందని, కొన్ని రోజుల తర్వాత తన తల్లి కనిపించకుండా పోయిందని ఆమె కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మొత్తం మీద సెక్స్ స్కాండల్ కేసులో హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ, ఆయన తండ్రి, మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణలపై సిట్ అధికారులు రెండో సారి నోటీసులు జారీ చెయ్యడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని జేడీఎస్ నాయకులు హడలిపోతున్నారు. విదేశాల్లో ఉన్న ప్రజ్వల్ రేవణ్ణను భారత్ తీసుకురావడానికి కర్ణాటక సిట్ అధికారులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారని ఓ సీనియర్ పోలీసు అధికారి అంటున్నారు.












Click it and Unblock the Notifications