love issues: కూతురిని వెంటాడి నరికి చంపిన తండ్రి, అబ్బాయితో అలా ?, నా ఇష్టం, ఏం చేస్తావ్ !
బెంగళూరు/మైసూరు: వయసుకు వచ్చిన యువతి స్నేహితుడిని ప్రేమించింది. ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసి జీవించాలని యువతి నిర్ణయించింది. అమ్మాయి ప్రేమ వ్యహారం ఆమె ఇంట్లో తెలిసింది. నా కూతురు తక్కువ కులం యువకుడిని ప్రేమించిందని తండ్రి రగిలిపోయాడు. మన కులం వాడిని నువ్వు పెళ్లి చేసుకోవాలని తండ్రి అతని కూతురికి చెప్పాడు. అయితే నేను ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటాను, నువ్వు ఏం చేస్తావో చేసుకో అంటూ కూతురు ఎదురుతిరిగింది. కూతురు ఎదురు తిరగడంతో సహనం కోల్పోయిన తండ్రి కూతురిని వెంటాడి వెంటాడి కొడవలితో నరికి చంపేయడం కలకలం రేపింది.

క్లోజ్ ఫ్రెండ్స్
కర్ణాటకలోని మైసూరు జిల్లా హిరియపట్టణలో జయరామ్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. సొంతపొలంలో జయరామ్ వ్యవసాయం చేయిస్తూ కుటుంబాన్ని పోషిస్లున్నాడు. జయరామ్ కుమార్తె గాయిత్రి (19) కాలేజ్ లో చదువుతోంది. కాలేజ్ లో చదువుతున్న చిన్ననాటి స్నేహితుడు బాబుతో గాయిత్రి చనువు పెంచుకుంది.

పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిన ప్రేమికులు
గాయిత్రి, బాబు స్నేహం ప్రేమగా మారింది. అందరు ప్రేమికుల్లాగానే గాయిత్రీ, బాబు కలిసి మెలసి తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకుని పిల్లలతో కలిసి జీవితాంతం కలిసి జీవించాలని గాయిత్రీ, బాబు నిర్ణయించారు. పెళ్లికి పెద్దలు అంగీకరించకపోతే ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు.

ప్రియుడు తక్కువ కులం వాడని ఇంట్లో గొడవ
గాయిత్రీ, బాబుల కులాలు వేరు. గాయిత్రీ ప్రేమ విషయం ఆమె ఇంట్లో తెలిసిపోయింది. నువ్వు ఎవరితో పడితే వాళ్లతో తిరిగితే మేము ఒప్పుకోమని, మేము చెప్పినచోట పెళ్లి చేసుకుని జీవితాంతం సుఖంగా ఉండాలని, లేదంటే పరిస్థితి వేరుగా ఉంటుందని జయరామ్ కుమార్తె గాయిత్రీని గత నెల రోజుల నుంచి హెచ్చరిస్తూ వస్తున్నాడు.

నువ్వు ఏమి చేస్తావో చేసుకో
ఇంట్లో అమ్మానాన్న ఎంత హెచ్చరించాని గాయిత్రీ ఏమాత్రం పట్టించుకోలేదు. పొలం దగ్గర వ్యవసాయం చేయిస్తున్న తండ్రి జయరామ్ కు అతని కూతురు గాయిత్రీ మద్యహ్నాం భోజనం తీసుకుని వెళ్లింది. కూతురు గాయిత్రీ పొలం దగ్గర ఒంటరిగా ఉండటంతో జయరామ్ ఆమెకు బుద్దిమాటలు చెప్పాడు. నేను ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటాను, నువ్వు ఏమి చేస్తావో చేసుకో, నేను ఎవ్వరి మాట వినను అంటూ గాయిత్రీ తేల్చి చెప్పింది.

వెంటాడి చంపేసిన తండ్రి
కూతురు గాయిత్రీ లెక్కచెయ్యకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడటంతో పొలం దగ్గర ఉన్న కొడవలి తీసుకున్న జయరామ్ ఆమె మీద దాడి చెయ్యడానికి ప్రయత్నించాడు. తండ్రి ఒక్కసారిగా రెచ్చిపోవడంతో గాయిత్రీ తప్పించుకుని పొలంలో పరుగు తీసింది. పొలాల వెంట పరుగు తీస్తున్న గాయిత్రీని వెంటాడని జయరామ్ కొడవలి తీసుకుని ఆమె తల, మెడ మీద దాడి చెయ్యడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు వదిలేసింది.
Recommended Video

నా కూతురిని నేనే చంపేశాను
కూతురిని హత్య చేసిన జయరామ్ కొడవలి తీసుకుని నేరుగా హిరియపట్టణ పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. తన కూతురిని తానే చంపేశానని జయరామ్ పోలీసుల ముందు అంగీకరించాడు. తక్కువ కులం వాడిని ప్రేమించినందుకు కన్న కూతురిని ఆమె తండ్రి హత్య చెయ్యడం కలకలం రేపింది. కర్ణాటకలో ఈ మద్యకాలంలో పరువు హత్యలు పదేపదే జరగడం హాట్ టాపిక్ అయ్యింది.












Click it and Unblock the Notifications