Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Love Jihad: ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా చెప్పిన మాట వినలేదు, అందుకే చంపేశా, ముస్లీం ప్రియుడు !

లక్నో: హిందూ యువతి, ముస్లీం యువకుడు ప్రేమించుకున్నారు. నువ్వు మతం మార్చుకోవాలని, నిన్ను నేను పెళ్లి చేసుకుంటానని ప్రియుడు అతని ప్రియురాలికి చెప్పాడు. మతం మారకుండా పెళ్లి చేసుకుందామని, తాను మాత్రం ఇస్లాం మతం స్వీకరించడానికి ఆమె తేల్చి చెప్పడంతో ప్రేమికుల మద్య గొడవలు జరిగాయి. ఇస్లాం మతం స్వీకరించే విషయంలో గొడవ జరగడంతో సహనం కోల్పోయిన ప్రియుడు అతని ప్రియురాలిని అపార్ట్ మెంట్ పైనుంచి కిందకుతోసి చంపేసి పరారైనాడు.

పోలీసులు వెంటాడి ప్రియుడిని పట్టుకున్నారు. పోలీసుల విచారణలో కలకలం రేపే విషయాలు బయటకు వచ్చాయి. ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా, సోషల్ మీడియాలో ఫోటోలు పోస్టు చేస్తానని చెప్పినా ఆమె భయపడలేదని ప్రియుడు పోలీసులకు చెప్పాడు.

ఒకే ఏరియా లవర్స్

ఒకే ఏరియా లవర్స్

ఉత్తరపరదేశ్ రాజధాని లక్నోలోని దుబగ్గా పోలీస్ స్టేషన్ పరిధిలోని బసంత్ కుంజ్ సెక్టార్ హెచ్ లో నిధి గుప్తా (19) అనే యువతి నివాసం ఉంటున్నది. అదే ప్రాంతంలో మోహమ్మద్ సోఫియాన్ అలియాస్ మోహమ్మద్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. నిధి గుప్తాకు, మోహమ్మద్ గత సంవత్సరం నుంచి ప్రేమించుకుంటున్నారు.

మతం మారాలని ఒత్తిడి

మతం మారాలని ఒత్తిడి

నువ్వు మతం మార్చుకుంటే నిన్ను నేను పెళ్లి చేసుకుంటానని నిధి గుప్తాకు ఆమె ప్రియుడు మోహమ్మద్ చెప్పాడు. ప్రియుడు మోహమ్మద్ మాటలతో నిధి గుప్తా షాక్ అయ్యింది. నేను ఇస్లాం మతం స్వీకరించను, హిందువుగానే ఉంటానని, నువ్వు అంగీరించకపోతే నేను నిన్ను పెళ్లి చేసుకోనని నిధి గుప్తా తేల్చి చెప్పింది.

ప్రియురాలిని చంపేసి ఎస్కేప్

ప్రియురాలిని చంపేసి ఎస్కేప్

ప్రియుడు మోహమ్మద్ ను నిధి గుప్తా దూరం పెట్టడానికి ప్రయత్నించింది. ఇస్లాం మతం స్వీకరించే విషయంలో గొడవ జరగడంతో సహనం కోల్పోయిన మోహమ్మద్ అతని ప్రియురాలు నిధి గుప్తాను అపార్ట్ మెంట్ నాలుగో అంతస్తు మీదకు లాక్కొని వెళ్లి అక్కడి నుంచి ఆమెను కిందకుతోసేశాడు. తీవ్రగాయాలైన నిధి గుప్తా లక్నోలోని కింగ్ జార్జ్ ఆసుపత్రిలో చనిపోయింది.

వాడు నా కూతుర్ని టార్చర్ పెట్టాడు

వాడు నా కూతుర్ని టార్చర్ పెట్టాడు

మోహమ్మద్ తన కుమార్తెను మతం మారాలని టార్చర్ పెట్టాడని, 15 రోజుల నుంచి ఆమె మీద దాడి చేస్తున్నాడని నిధి గుప్తా తల్లి పోలీసు కేసు పెట్టారు. హత్య చేశాడని, బలవంతంగా మతం మారాలని ఒత్తిడి చేశాడని మోహమ్మద్ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. తప్పించుకుని తరుగుతున్న మోహమ్మద్ ను శుక్రవారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు.

పోలీసు ఎన్ కౌంటర్ జస్ట్ మిస్

పోలీసు ఎన్ కౌంటర్ జస్ట్ మిస్

ప్రియురాలు నిధి గుప్తాను దారుణంగా హత్య చేసి తప్పించుకుని పారిపోయిన మోహమ్మద్ మీద ఉత్తరప్రదేశ్ పోలీసులు కాల్పులు జరిపారు. మోహమ్మద్ కాలిలో తూటాలు దూసుకుపోవడంతో అతను కుప్పకూలిపోయాడు. మోహమ్మద్ ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. తరువాత కిరాతకుడు మోహమ్మద్ ను పోలీసులు విచారణ చేశారు.

లవ్ జీహాద్..... బ్లాక్ మెయిల్

లవ్ జీహాద్..... బ్లాక్ మెయిల్

గతంలో నేను నిధి గుప్తా కలిసి చాలా ఫోటోలు తీసుకున్నామని మోహమ్మద్ పోలీసులకు చెప్పాడు. మతం మారడానికి నిధి గుప్తా అంగీకరంచలేదని, మనం తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని తాను బెదిరించినా నిధి మాత్రం మతం మారడానికి అంగీకరించలేదని, అందుకే కోపంతో ఆమెను చంపేశానని మోహమ్మద్ పోలీసుల విచారణలో అంగీకరించాడు. లవ్ జీహాద్ దెబ్బతోనే నిధి గుప్తాను మోహమ్మద్ హత్య చేశాడని లక్నో పోలీసులు అంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+