బీజేపీ 'లవ్ జిహాద్': ప్రేమను బ్యాన్ చేయాలా అని సీఎం

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో గద్దెనెక్కాలని కలలుకంటున్న భారతీయ జనతా పార్టీ లవ్ జిహాద్‌ను తెరపైకి తీసుకు వచ్చిందంటున్నారు. శనివారం యూపీ బీజేపీ కార్యవర్క సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇవి రెండు రోజుల పాటు జరుగుతాయి. ఈ సందర్భంగా యూపీలో పాగా వేస్తామని నేతలు బలంగా చెబుతున్నారు. ఇందుకోసం కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. అందులో లవ్ జిహాద్‌ను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఉత్తర ప్రదేశ్‌లో అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం పైన చాలామంది అసంతృప్తితో ఉన్నారు. ప్రధానంగా శాంతిభద్రతల సమస్య అఖిలేష్‌ను ఇబ్బంది పెడుతోంది. యూపీలో 2017లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అఖిలేష్ ప్రభుత్వం పైన అసంతృప్తి, అప్పటి వరకు మోడీ హవా తగ్గి.. తమకు అనుకూలిస్తుందని బీఎస్పీ అధినేత్రి మాయావతి భావిస్తున్నారు. 2017లో గెలుపు కోసం ఇప్పటి నుండి ఎవరి వ్యూహరచన వారు చేస్తున్నారు.

Love jihad is BJP’s new poll polarizer

అందులో భాగంగా బీజేపీ లవ్ జిహాద్‌ను కూడా తెరపైకి తెచ్చింది. అయితే, లవ్ జిహాద్ నినాదం బీజేపీని చిక్కుల్లోకి నెట్టే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. బీజేపీ లవ్ జిహాద్ నినాదంతో ముందుకు వెళ్తే.. ఎస్పీ, కాంగ్రెస్, బీఎస్పీలు కమలం పార్టీని ఏవిధంగా ఎదుర్కొంటాయి? వీరి దాడిని బీజేపీ ఎలా ఎదుర్కొంటుందనే చర్చ సాగుతోంది.

బీజేపీ లవ్ జిహాద్ నిర్ణయం పైన యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. దీని పైన ఎలా స్పందించాలో తనకు అర్థం కావడం లేదన్నారు. ప్రేమించుకునే యువతీ, యువకులు ఒకరినొకరు తెలుసుకుంటారని, వారి ప్రేమకు ఎలా అడ్డు చెప్పగలమని అన్నారు. యువతీ, యువకులు ప్రేమించుకోవడాన్ని బ్యాన్ చేయాలా అని అఖిలేష్ ప్రశ్నించారు. ఏ ముఖ్యమంత్రి ప్రేమించుకోవడాన్ని నిషేధించాడని ఎద్దేవా చేశారు.

మధుర బీజేపీ ఎంపీ హేమమాలినికి కూడా అటువంటి రిలేషన్ పైన ఎలాంటి అభ్యంతరంలేదన్నారు. 1975లో తను నటించిన హిందీ చిత్రం 'ధర్మాత్మ'లో ముస్లిం యువకుడిగా చేసిన ఫిరోజ్ ఖాన్ పాత్రను ప్రేమిస్తారన్నారు. ఆ సినిమాలోని 'లవ్ జిహాద్' అనుకూలంగా వచ్చే పాటలో ఆమె నర్తించారని గుర్తు చేశారు. బీజేపీ నేతలు కూడా అలాంటి ప్రేమను ప్రోత్సహిస్తున్నారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+