Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Love marriage: ఎవడు వాడు ?, భార్యను చంపేసి యూరియా మూటలో కట్టేసి, కండెక్టర్ స్కెచ్ !

బెంగళూరు: ఆర్ టీసీలో ఉద్యోగం చేస్తున్న యువకుడు నాలుగు సంవత్సరాలు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అమ్మమ్మ ఇంటిలో కాపురం పెట్టిన భర్త అతని భార్యతో కలిసి సంతోషంగా కాపురం చేశాడు. పెళ్లి కాకముందు ఉద్యోగం చేస్తున్న సమయంలో పరిచయం అయిన వ్యక్తి విషయంలో దంపతుల మద్య గొడవ జరిగింది. అంతే భార్యను చంపేసిన భర్త ఆమె శవాన్ని యూరియా మూటలో కట్టేసి పొలంలోకి తీసుకెళ్లి పాతిపెట్టేశాడు. ఎవ్వరికి అనుమానం రాకుండా శవం మీద టెంకాయ చెట్లు నాటేశాడు. వ్యక్తిగత పనిమీద ఇంటి నుంచి బయటకు వెళ్లిన తన భార్య కనపడకుండా పోయిందని, తనకు భయంగా ఉందని పోలీసు కేసు పెట్టిన భర్త అడ్డంగా బుక్కైపోయాడు.

 ఆర్ టీసీలో ఉద్యోగం

ఆర్ టీసీలో ఉద్యోగం

బెంగళూరు నగర శివార్లలోని కనకపురలోని గోపాలక్రిష్ణ టెంట్ హౌస్ సమీపంలో నివాసం ఉంటున్న లోకేష్ (30) అనే యువకుడు కేఎస్ఆర్ టీసీలో కండెక్టర్ అండ్ డ్రైవర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. హావేరి జిల్లా హానగల్ తాలుకా హోంకణ గ్రామానికి చెందిన గీతా (25) అనే యువతి బెంగళూరు నగర శివార్లోని నెలమంగల సమీపంలోని మాదనాయకనహళ్ళి చేరుకుని అక్కడ గార్మెంట్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేసేది.

 కులాలు వేరు...... లవ్ మ్యారేజ్

కులాలు వేరు...... లవ్ మ్యారేజ్

ఐదు సంవత్సరాల క్రితం లోకేష్, గీతాకు పరిచయం అయ్యింది. తరువాత లోకేష్, గీతా ప్రేమించుకున్నారు. కులాలు వేరు అయినా ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. లోకేష్ ఆర్ టీసీలో ఉద్యోగం చేస్తున్నాడని ధైర్యంగా గీతా అతన్నిపెళ్లి చేసుకుని సంతోషంగా జీవించాలని నిర్ణయించింది. నాలుగు సంవత్సరాల క్రితం లోకేష్, గీతా కులాంతర వివాహం చేసుకున్నారు.

 పెళ్లికి ముందే కండీషన్

పెళ్లికి ముందే కండీషన్

పెళ్లి చేసుకున్న తరువాత నువ్వు ఉద్యోగం చెయ్యకూడదని లోకేష్ గీతాకు కండీషన్ పెట్టాడు. భర్త చెప్పినట్లు కొంతకాం ఉద్యోగం చేసిన గీతా తరువాత ఇంటికే పరిమితం అయ్యింది. పెళ్లి చేసుకున్న తరువాత లోకేష్ సాతనూరు సమీపంలోని యలవళ్ళి గ్రామంలోని అమ్మమ్మ ఇంటిలో భార్య గీతాతో కలసి ఉంటూ ఉద్యోగానికి వెళ్లి వస్తున్నాడు.

 వాడితో నీకు ఏమిటి సంబంధం ?

వాడితో నీకు ఏమిటి సంబంధం ?

పెళ్లి కాకముందు గీతాకు పరిచయం ఉన్న వ్యక్తి విషయంలో భర్త లోకేష్ నిత్యం భార్యతో గొడవపడేవాడు. ఇదే విషయంలో నిత్యం దంపతుల మధ్య గొడవలు జరిగేవి. లోకేష్ బంధువులు, స్నేహితులు ఇంతకాలం వారికి సర్దిచెబుతూ వచ్చారు. నీకు అతనితో అక్రమ సంబంధం ఉందని, అందుకే అప్పుడప్పుడు బయటకు వెళ్లి వస్తున్నావని, ఫోన్లు చేసి మాట్లాడుతున్నావని భర్త లోకేష్ భార్య గీతా మీద రగిలిపోయాడు. ఇదే విషయంలో భార్య గీతా మీద ఆమె భర్త లోకేష్ అనుమానం పెంచుకున్నాడు.

 భార్యను చంపేసి యూరియా మూటలో కట్టేసి పాతిపెట్టిన భర్త

భార్యను చంపేసి యూరియా మూటలో కట్టేసి పాతిపెట్టిన భర్త

జూన్ 1వ తేదీన రాత్రి ఇంట్లో గీతా, లోకేష్ దంపతలు పాతపంచాయితీ విషయంలోనే గొడవపడ్డారు. ఆ సమయంలో సహనం కోల్పోయిన లోకేష్ భార్య గీతా తల మీద బలంగా కొట్టడంతో ఆమె ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. తరువాత అర్దరాత్రి గీతా శవాన్ని యూరియా మూటలో కట్టేశాడు. బైక్ లో శవాన్ని పొలంలోకి తీసుకెళ్లిన లోకేష్ అక్కడే గోతితీసి పాతిపెట్టేశాడు.

 భర్త అతితెలివి...... పోలీసుల ముందు డ్రామాలు

భర్త అతితెలివి...... పోలీసుల ముందు డ్రామాలు

పొలంలో భార్య గీతా శవాన్ని పాతిపెట్టిన తరువాత అక్కడ మట్టి చదును చేసిన లోకేష్ అతి తెలివి ప్రదర్శించాడు. కొన్ని టెంకాయ చెట్లు తీసుకెళ్లిన భర్త లోకేష్ గీత శవం మీద, పరిసర ప్రాంతాల్లో వాటిని నాటేశాడు. వ్యక్తిగత పనిమీద బయటకు వెళ్లిన తన భార్య కనపడటం లేదని లోకేష్ పోలీసు కేసు పెట్టాడు. కేసు నమోదు చేసిన పోలీసులు లోకేష్, గీతా మొబైల్ ఫోన్ నెంబర్ల డేటాను పరిశీలించారు. భర్త లోకేష్ తీరుతో అనుమానం రావడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని బెండ్ తీశారు.

 కేసు పెట్టి అడ్డంగా బుకైపోయిన భర్త

కేసు పెట్టి అడ్డంగా బుకైపోయిన భర్త

తన భార్యను తానే హత్య చేశానని పోలీసుల విచారణలో లోకేష్ అంగీకరించాడు. పొలంలో పాతిపెట్టిన గీతా మృతదేహాన్ని బయటకుతీసి పోస్టుమార్టంకు తరలించారు. కరోనా కాలంలో, లాక్ డౌన్ దెబ్బతో తీరికలేకుండా ఉద్యోగాలు చేస్తున్న సమయంలో భార్యను చంపేసి పొలంలో పాతిపెట్టి భర్త డ్రామాలు ఆడి ఇబ్బంది పెట్టడంతో పోలీసులు మండిపడుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+