Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Love story: ప్రియుడితో హీరోయిన్ రొమాన్స్, అడ్డుపడిన సోదరుడు ఫినిష్, తల, మొండెం, కాళ్లు !

బెంగళూరు/ హుబ్బళి: ప్రియుడితో జల్సాలు చేస్తున్న హీరోయిన్ కు ఆమె సొంత సోదరుడు అభ్యంతరం చెప్పాడు. సెలబ్రిటీ మేనేజర్ అయిన వ్యక్తితో నువ్వు రాసుకునిపూసుకుని తిరగడం ఏమీ భాగాలేదని, నీకు మంచి భవిష్యత్తు ఉందని ఆ మోడల్ అండ్ హీరోయిన్ కు ఆమె సోదరుడు నచ్చచెప్పాడు. నా ప్రేమకు అడ్డు వస్తున్నాడని, మనం ఎంతకాలం ఇలా దాక్కొని తిరగాలని ఆ నటి ప్రియుడి దగ్గర డ్రామాలు వేసిందని సమాచారం. రిగిలిపోయిన ప్రియుడు ప్రియురాలి సోదరుడి తల, మొండెం, కాళ్లు, చేతులు నరికేసి అతిదారుణంగా హత్య చేశాను అతని శవాన్ని ముక్కలు ముక్కలు చేసి కారులో వెలుతూ వెలుతూ చుట్టుపక్కల విసిరేసుకుంటూ వెళ్లిపోయాడు. సోదరుడి హత్య కేసులో మాజీ ఎయిర్ హోస్టెస్, మిస్ కర్ణాటక విన్నర్, ప్రముఖ హీరోయిన్ తో పాటు ఆమె ప్రియుడు అరెస్టు కావడం కలకలం రేపింది.

మిస్ కర్ణాటక విన్నర్ + మాజీ ఎయిర్ హోస్టెస్

మిస్ కర్ణాటక విన్నర్ + మాజీ ఎయిర్ హోస్టెస్

మాజీ ఎయిర్ హోస్టెస్ గా పని చేస్తున్న సమయంలో తన అందచందాలతో శనయా కట్ వే అలియా శనయా అనే యువతి అందరినీ ఆకర్షించింది. తరువాత జరిగిన మిస్ కర్ణాటక పోటీల్లో పాల్గొన్న శనయా ఆ పోటీల్లో విజేతగా నిలిచింది. మిస్ కర్ణాటక కిరీటం దక్కించుకున్న శనయా తరువాత మంచి గుర్తింపు తెచ్చుకుని సెలబ్రిటీల జాబితాలో చేరిపోయింది.

సినిమాల్లో బిజీబిజీ

సినిమాల్లో బిజీబిజీ

మిస్ కర్ణాటక కిరీటం దక్కించుకున్న తరువాత శనయా కట్ వే ఎయిర్ హోస్టెస్ ఉద్యోగానికి చెక్ చెప్పింది. కన్నడలో సూపర్ హిట్ అయిన ఒక గంట కథ, అండర్ వరల్డ్ నేపథ్యంలో తెరకెక్కిన చోటా బాంబే సినిమాల్లో నటించిన శనయా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఓ తెలుగు సినిమాలో ఖూడా శనయా హీరోయిన్ గా నటించింది.

హీరోయిన్ తమ్ముడి దారుణ హత్య

హీరోయిన్ తమ్ముడి దారుణ హత్య

కర్ణాటకలోని హుబ్బళిలో హీరోయిన్ శనయా కట్ వే కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు. హీరోయిన్ శనయాకు రాకేష్ అనే సోదరుడు ఉన్నాడు. ఇటీవల హీరోయిన్ శనయా సోదరుడు రాకేష్ దారుణ హత్యకు గురైనాడు. హుబ్బళి గ్రామీణ పోలీసులు రాకేష్ హత్య కేసును సవాలుగా స్వీకరించి ఆకేసును చాకచక్యంగా చేదించారు.

 సెలబ్రిటీ మేనేజర్ అండ్ కో అరెస్టు

సెలబ్రిటీ మేనేజర్ అండ్ కో అరెస్టు


సెలబ్రిటీ మేనేజర్ గా పని చేస్తున్న నియాజ్ అహమ్మద్ అనే వ్యక్తిని హుబ్బళి గ్రామీణ పోలీసులు అరెస్టు చేశారు. నియాజ్ అహమ్మద్ తో పాటు అతని అనుచరులు నలుగురిని ఇప్పటికే హుబ్బళి గ్రామీణ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో నియాజ్ అహమ్మద్ దిమ్మతిరిగిపోయే వివరాలు వెళ్లడించాడని తెలిసింది.

 హీరోయిన్ నా లవర్ ?

హీరోయిన్ నా లవర్ ?

మిస్ కర్ణాటక, సినిమా హీరోయిన్ శనయా తాను ప్రేమించుకున్నామని, ఇద్దరు కలిసి ఏకాంతంగా చాలా ప్రాంతాల్లో తిరిగామని నియాజ్ అహమ్మద్ పోలీసుల విచారణలో వెలుగు చూసింది. మా ప్రేమకు శనయా సోదరుడు రాకేష్ పదేపదే అడ్డుపడుతున్నాడని, మేము సుఖంగా ఉండాలంటే రాకేష్ ను హత్య చెయ్యాలని ఆ రోజు డిసైడ్ అయ్యామని నియాజ్ మహమ్మద్ బాంబు పేల్చాడు.

ముక్కలు ముక్కలు చేసి విసేరేశారు

ముక్కలు ముక్కలు చేసి విసేరేశారు


హీరోయిన్ శనయా ప్రియుడు నియాజ్ అహమ్మద్ అతని అనుచరులు రాకేష్ ను దారుణంగా చంపేసి తరువాత శవాన్ని కారులో దాచిపెట్టారు. కారులో రాకేష్ శవం నుంచి దుర్వాసన రావడంతో పోలీసులకు చిక్కిపోతామని వాళ్లు బయపడ్డారు. తరువాత రాకేష్ శవాన్ని తల, మొండెం, కాళ్లు, చేతులు పూర్తిగా కత్తిరించి హుబ్బళి నగరం సమీపంలో హుబ్బళి గ్రామీణ పోలీస్ స్టేసన్ పరిధిలోని వేరేవేరే ప్రాంతాల్లో విసిరేశారు.

హీరోయిన్ కు సంబంధం ?

హీరోయిన్ కు సంబంధం ?


రాకేష్ శవం ఆచూకి ఏమాత్రం చిక్కకుండా తప్పించుకోవాలని వీళ్లు స్కెచ్ వేశారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. రాకేష్ శవం పోలీసులకు చిక్కకుండా అలా చేశామని నియాజ్ మహమ్మద్ పోలీసుల విచారణలో అంగీకరించాడు. సోదరుడు రాకేష్ హత్య కేసుతో హీరోయిన్ శనయాకు సంబంధం ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హీరోయిన్, మిస్ కర్ణాటక శనయా కట్ వేను హుబ్బళి గ్రామీణ పోలీసులు అరెస్టు చెయ్యడం కలకలం రేపింది. హీరోయిన్ శనయాను పోలీసులు విచారణ చేసి వివరాలు బయటకు లాగుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+