Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Love trap: అలెక్స్ రెడ్ హిల్స్ స్కెచ్, నీకళ్లు నీలి సముద్రం డ్యూయెట్, స్వర్గం అంటే ఇదే, తోపుగాడు !

చెన్నై/ బెంగళూరు: పెళ్లి చేసుకుంటానని అమ్మాయికి మాయమాటలు చెప్పిన యువకుడు ఆమెను లొంగదీసుకున్నాడు. నీ కళ్లు నీల సముద్రం అంటూ ఓ డ్యూయెట్ వేసుకున్నాడు. అంతే అమ్మాయికి మస్కాకొట్టి రెడ్ హిల్స్ ప్రాంతంలో బంధువుల ఇంట్లో అమ్మాయిని నిర్బంధించాడు. అమ్మాయి బయటకు వెళ్లకుండా చేసి పెళ్లి అయిన తరువాత కనపడే స్వర్గం ఇదే అంటూ ఐదు రోజులు అమ్మాయిపై అత్యాచారం చేస్తూ వచ్చాడు.అమ్మాయిపై తోపులాగా రేప్ చూస్తూ వచ్చిన కామాంధుడు చివరికి పులియంతోప్పు పోలీసులకు అడ్డంగా చిక్కిపోవడంతో జైల్లో రామభజన చేస్తున్నాడు.

 మంచి ఫ్యామిలి

మంచి ఫ్యామిలి

చెన్నైలోని పులియంతోప్పు ప్రాంతంలో ఓ దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు 15 ఏళ్ల రాధ (పేరు మార్చడం జరిగింది) అనే కుమార్తె ఉంది. తల్లిదండ్రుల చాటు అమ్మాయిలాగా రాధ బతుకుతోంది. 15 ఏళ్ల వయసులో కొందరు సామాన్య మధ్యతరగతి అమ్మాయిలు లాగే ఈ రాధ కూడా కలలు కనింది.

 రాధ లైఫ్ లోకి రాక్షసుడు ఎంట్రి

రాధ లైఫ్ లోకి రాక్షసుడు ఎంట్రి

వ్యాసరప్పాడి ప్రాంతానికి చెందిన అలెక్స్ (22) అనే యువకుడు కొంత కాలం నుంచి రాధ మీద కన్ను వేశాడు. ఎలాగైనా రాధను లైన్ లో పెట్టి ఎంజాయ్ చెయ్యాలని ప్లాన్ వేశాడు. రోటిన్ గా అమ్మాయిలతో ఎంజాయ్ చెయ్యాలంటే కొందరు కామాంధులు ఉపయోగించే లవ్ అనే పదాన్ని అలెక్స్ సెలెక్ట్ చేసుకున్నాడు. అంతే కొంతకాలం రాధ వెంటపడి I love U అంటూ బిల్డప్ ఇచ్చాడు.

 నా రారాజు వచ్చేశాడు

నా రారాజు వచ్చేశాడు

అలెక్స్ చిల్లర చేష్టలకు రాధ కనెక్ట్ అయ్యింది. అంతే మొదట అందరూ అమ్మాయిలు లాగే రాధ కూడా బెట్టుచేసింది. అయితే అలెక్స్ మాయలో పడిపోయిన రాధ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అతనికి చెప్పింది. కొంతకాలం రాధతో కలిసి లోకల్ ట్రిప్ లు వేసిన అలెక్స్ తరువాత లాగ్ ట్రింప్ వెయ్యాలని స్కెచ్ వేశాడు. నా రారాజు వచ్చేశాడు అంటూ రాధ మురిసిపోయింది.

 రెడ్ హిల్స్ అయితే సేఫ్

రెడ్ హిల్స్ అయితే సేఫ్

అలెక్స్ బంధువులు రెడ్ హిల్స్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని, ఇంట్లో నుంచి వచ్చేయాలని అలెక్స్ రాధకు చెప్పాడు. ఈనెల 14వ తేదీన తల్లిదండ్రులు లేని సమయంలో పులియంతోప్పులోని ఇంటి నుంచి రాధ బయటకు వచ్చింది. నేను ఇప్పుడే పెళ్లి చేసుకోనని రాధ ప్రియుడు అలెక్స్ కు చెప్పింది. అయితే మా బంధువుల ఇంటికి వెళ్లి సాయంత్రం మళ్లీ ఇంటికి వచ్చేద్దాం అని రాధను అలెక్స్ నమించాడు.

 పెళ్లి తరువాత స్వర్గం అంటే ఇదే

పెళ్లి తరువాత స్వర్గం అంటే ఇదే

రెడ్ హిల్స్ లోని బంధువుల ఇంటికి రాధను పిలుచుకుని వెళ్లిన అలెక్స్ ఆమెను అక్కడ నిర్బంధించాడు. పెళ్లి తరువాత స్వర్గం ఇలాగే ఉంటుందని రాధ మీద అలెక్స్ అత్యాచారం చేశాడు. బయటకు వెళ్లిన కుమార్తె ఇంటికి తిరిగిరాకపోవడంతో ఆమె తండ్రి అనేక చోట్ల గాలించి చివరికి చెన్నైలోని పులియంతోప్పు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంధువుల ఇంటి నుంచి రాధ బయటకు వెళ్లకుండా చేసిన అలెక్స్ ఆమె మీద పదేపదే అత్యాచారం చేస్తూ వచ్చాడు.

 ఐదు రోజులు ఆడిందేఆట పాడిందేపాట

ఐదు రోజులు ఆడిందేఆట పాడిందేపాట

రాధ, అలెక్స్ లవ్ స్టోరీ తెలుసుకున్న పోలీసులు అతని మొబైల్ నెంబర్ ట్రేస్ చెయ్యడంతో ఆదివారం అతను రెడ్ హిల్స్ ప్రాంతంలో ఉన్నాడని పోలీసులు గుర్తించారు. నేరుగా రెడ్ హిల్స్ వెళ్లిన పోలీసులు అలెక్స్, రాధను అదుపులోకి తీసుకున్నారు. పెళ్లి పేరుతో రాధ మీద ఐదు రోజుల పాటు అత్యాచారం చేశాడని వెలుగు చూడటంతో ఫోక్సో చట్టం కింద అలెక్స్ ను అరెస్టు చేసి జైలుకు పంపించారు. రాధ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచాణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. రాధను వైద్యపరీక్షలకు పంపించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+