Lovers: లవర్స్ మిడ్ నైట్ జాలీరైడ్, పీకలదాక తాగేసి ఊగేసి బైక్ నడిపిన ప్రియుడు, తల్లీ, బిడ్డ ప్రాణాలు !

చెన్నై: ఐఐటీలో ప్రాజెక్ట్ అసోసియేట్ గా పని చేస్తున్న యువకుడు ఓ యువతిని ప్రేమించాడు. ప్రేమికులు ప్రతిరోజు బైక్ లో జాలీగా షికార్లు తిరుగుతున్నారు. రాత్రి ప్రేమికులు లిక్కర్ పార్టీకి హాజరైనారు. స్నేహితులతో కలిసి ప్రియుడు పీకలదాక మద్యం సేవించాడు. అర్దరాత్రి వరకు మందుపార్టీ జరిగిందని వెలుగు చూసింది. అర్దరాత్రి బైక్ లో ప్రియురాలిని పిలుచుకుని సిటీ మొత్తం రౌండ్స్ వేశాడు. వేకువ జామున రోడ్డు దాటుతున్న మహిళను ప్రేమికులు వెలుతున్న బైక్ వేగంగా ఢీకొనింది. ఈ ప్రమాదంలో మహిళతో పాటు ఆమె 8 నెలల చిన్నారి దుర్మరణం చెందడం కలకలం రేపింది.

చాలా ఏళ్లు మహిళకు పిల్లలు లేరు

చాలా ఏళ్లు మహిళకు పిల్లలు లేరు

చెన్నైలోని నితకరై ప్రాంతంలోని అన్నా ఆర్చి సమీపంలోని ఎన్ఎస్ కే నగర్ లో బూంగు జూలీ అలియాస్ జూలీ (30) అనే మహిళ నివాసం ఉంటున్నారు. వివాహం జరిగిన 7 సంవత్సరాల వరకు జూలీకి పిల్లలు పుట్టలేదు. 8 నెలల క్రితమే జూలీకి బిడ్డ పుట్టింది. బిడ్డను చూసుకుంటూ జూలీ చాలా సంతోషంగా జీవిస్తోంది.

ప్రియురాలితో లిక్కర్ పార్టీ

ప్రియురాలితో లిక్కర్ పార్టీ

చెన్నైలో నివాసం ఉంటున్న నికెల్ (27) చెన్నై ఐఐటీలో ప్రాజెక్ట్ అసోసియేట్ గా పని చేస్తున్నాడు. నికెల్ చెన్నైలో నివాసం ఉంటున్న ఓ యువతిని ప్రేమించాడు. నికెల్ అతని ప్రియురాలితో కలిసి ప్రతిరోజు బైక్ లో జాలీగా షికార్లు తిరుగుతున్నాడు. రాత్రి నికెల్ అతని ప్రియురాలితో కలిసి చెన్నైలోని ఓ హోటల్ లో లిక్కర్ పార్టీకి వెళ్లాడు.

ప్రియురాలు వెనుక ఉంటే కళ్లు నెత్తికెక్కాయి

ప్రియురాలు వెనుక ఉంటే కళ్లు నెత్తికెక్కాయి

స్నేహితులతో కలిసి నికెల్ పీకలదాక మద్యం సేవించాడు. నికెల్ ప్రియురాలు కూడా మద్యం సేవించిందని తెలిసింది. నికెల్ వెళ్లిన హోటల్ లో అర్దరాత్రి వరకు మందుపార్టీ జరిగిందని వెలుగు చూసింది. అర్దరాత్రి నికెల్ అతని బైక్ లో ప్రియురాలిని పిలుచుకుని చెన్నై సిటీ మొత్తం రౌండ్స్ వేశాడు.

రోడ్డు దాటుతున్న జూలీ, ఆమె బిడ్డ ?

రోడ్డు దాటుతున్న జూలీ, ఆమె బిడ్డ ?


ఎన్ఎస్ కే నగర్ లో వేకువ జామున 3.30 గంటల సమయంలో జూలీ ఆమె బిడ్డను ఎత్తుకుని రోడ్డు దాటడానికి ప్రయత్నించింది. ఆ సమయంలో నికెల్ వెలుతున్న బైక్ వేగంగా జూలీని, ఆమె బిడ్డను ఢీకొనింది. ఈ ప్రమాదంలో జూలీతో పాటు ఆమె 8 నెలల చిన్నారి స్పాట్ లో చనిపోవడం కలకలం రేపింది.

పూజారి కోసం వెళ్లిన మహిళ..... లవర్స్ అరెస్టు

పూజారి కోసం వెళ్లిన మహిళ..... లవర్స్ అరెస్టు

జూలీ పూజ చెయ్యడానికి పూజారిని పిలుచుకుని రావడానికి వెలుతున్న సమయంలో జరిగిన ప్రమాదంలో ఆమెతో పాటు ఆమె బిడ్డ చనిపోయారని పోలీసులు అన్నారు. మద్యం మత్తులో ప్రియురాలితో కలిసి షికార్లుకు వెళ్లిన ప్రియుడు నికెల్ చేసిన పనికి తల్లీ, బిడ్డ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

నాలుగు సెక్షల కింద కేసు

నాలుగు సెక్షల కింద కేసు

ఇద్దరి మరణానికి కారణం అయిన నికెల్, అతని ప్రియురాలిని చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. నికెల్ మోతాదుకు మించి మద్యం సేవించి బైక్ నడిపాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ప్రేమికుల మీద పలు సెక్షల కింద కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నామని చెన్నై సిటీ పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+