Lovers: ఇంట్లో ప్రియురాలిని చంపేసి ఊరి బయట ప్రియుడి ఆత్మహత్య, పెళ్లి డేట్ ఫిక్స్ తో మేనేజర్ !

బెంగళూరు: ఓకే ప్రాంతంలో నివాసం ఉంటున్న యువతి, యువకుడు కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే ప్రియుడు వేరే రాష్ట్రానికి చెందినవాడు. ప్రైవేట్ కంపెనీలో మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్న ప్రియుడు మంచి జీతం తీసుకుంటున్నాడు. వివాహం చేసుకుని జీవితాంతం సంతోషంగా ఉండాలని ప్రేమికులు అనుకున్నారు. ప్రేమికులు అనుకున్నట్లు పరిస్థితులు అనుకూలించలేదు. రానురాను ప్రియుడికి దూరం అవుతూ వచ్చిన యువతి ఇటీవల వేరే యువకుడితో వివాహం చేసుకోవాలని నిర్ణయించింది. వేరే యువకుడితో ప్రియురాలి పెళ్లి నిశ్చితార్థం జరిగిపోయింది. ఈ విషయం జీర్ణించుకోలేని ప్రియుడు ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలని అనేక ప్రయత్నాలు చేశాడు. చివరికి ఇంట్లో తన ప్రియురాలు ఒంటరిగా ఉందని తెలుసుకున్న యువకుడు నేరుగా అక్కడికి వెళ్లాడు. ప్రియురాలిని ఇంట్లో హత్య చేసిన ప్రియుడు వేరే ప్రాంతానికి పారిపోయి అక్కడ అతను ఆత్మహత్య చేసుకున్నాడు.

 కర్ణాటక అమ్మాయి, తమిళనాడు అబ్బాయి

కర్ణాటక అమ్మాయి, తమిళనాడు అబ్బాయి

కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలోని అంకోలకు చెందిన ఉషాగౌడ (24) అనే యువతి కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని సంవత్సరాల క్రితం బెంగళూరు గ్రామీణ జిల్లాలోని లింగధీరమల్లసంద్ర గ్రామంలో నివాసం ఉంటున్నది. తమిళనాడుకు చెందిన గోపాలక్రిష్ణ (26) అనే యువకుడు హోసకోటే చేరుకుని అక్కడే నివాసం ఉంటున్నాడు.

 నాలుగు సంవత్సరాల నుంచి లవ్

నాలుగు సంవత్సరాల నుంచి లవ్

గోపాలక్రిష్ణ ఓ ప్రైవేట్ కంపెనీలో మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్నాడు, నాలుగు సంవత్సరాల క్రితం గోపాలక్రిష్ణకు, ఉషాగౌడకు పరిచయం అయ్యింది. తరువాత గోపాలక్రిష్ణ, ఉషాగౌడ ప్రేమలోపడ్డారు. ఓకే ప్రాంతంలో నివాసం ఉంటున్న గోపాలక్రిష్ణ, ఉషాగౌడ నాలుగు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు.

మంచి ఉద్యోగం ఉందని పెళ్లి చేసుకోవాలని స్కెచ్

మంచి ఉద్యోగం ఉందని పెళ్లి చేసుకోవాలని స్కెచ్

ప్రైవేట్ కంపెనీలో మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్న ప్రియుడు గోపాలక్రిష్ణ మంచి జీతం తీసుకుంటున్నాడు. వివాహం చేసుకుని జీవితాంతం సంతోషంగా ఉండాలని ప్రేమికులు గోపాలక్రిష్ణ, ఉషాగౌడ అనుకున్నారు. అయితే ప్రేమికులు గోపాలక్రిష్ణ, ఉపాగౌడ వారు అనుకున్నట్లు పరిస్థితులు ఏమాత్రం వారికి అనుకూలించలేదు.

 ప్రియురాలి పెళ్లి ఫిక్స్

ప్రియురాలి పెళ్లి ఫిక్స్

కొంతకాలం క్రితం నుంచి రానురాను ప్రియుడు గోపాలక్రిష్ణకుకి దూరం అవుతూ వచ్చిన ఉషాగౌడ ఇటీవల వేరే యువకుడితో వివాహం చేసుకోవాలని నిర్ణయించింది. వేరే యువకుడితో ప్రియురాలు ఉషాగౌడ నిశ్చితార్థం జరిగిపోయింది. ఉషాగౌడ పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయ్యింది. ఈ విషయం జీర్ణించుకోలేని ప్రియుడు గోపాలక్రిష్ణ అతని ప్రియురాలు ఉషాగౌడను ఎలాగైనా దక్కించుకోవాలని అనేక ప్రయత్నాలు చేశాడు.

Recommended Video

    సిద్దిపేట కలెర్టర్ పై మండిపడ్డ కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్ || Oneindia Telugu
     ఇంట్లో ప్రియురాలిని చంపేసి ఊరి బయట ప్రియుడి ఆత్మహత్య

    ఇంట్లో ప్రియురాలిని చంపేసి ఊరి బయట ప్రియుడి ఆత్మహత్య

    లింగధీరమల్లసంద్ర గ్రామంలోని ఇంట్లో తన ప్రియురాలు ఉషాగౌడ ఒంటరిగా ఉందని తెలుసుకున్న గోపాలక్రిష్ణ నేరుగా అక్కడికి వెళ్లాడు. ప్రియురాలు ఉషాగౌడతో గొడవ పెట్టుకున్న గోపాలక్రిష్ణ ఆమె గొంతు నులిమేసి తల దిండుతో ఆమె ముఖం మీద అదిమి ఇంట్లో హత్య చేశాడు. తరువాత ప్రియుడు గోపాలక్రిష్ణ హోసకోటేకు చాలా దూరం ఉన్న తరబహళ్ళి గ్రామం సమీపంలోని ప్రాంతానికి పారిపోయి అక్కడ అతను విషం సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమించుకున్న పెళ్లి చేసుకోవాలనుకున్న ప్రేమికులు ఒకరిని హత్య చేసి ఒకరు ఆత్మహత్య చేసుకోవడం హోసకోటేలో కలకలం రేపింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+