Lovers: వాట్సాప్ స్టేటస్ ఫోటోలు, ఉంగరం చూసి పొరపాటుతో ప్రియురాలిని చంపేసి ప్రియుడి ఆత్మహత్య !

బెంగళూరు: వివాహం చేసుకుని జీవితాంతం సంతోషంగా ఉండాలని ప్రేమికులు అనుకున్నారు. ప్రేమికులు అనుకున్నట్లు పరిస్థితులు అనుకూలించలేదు. రానురాను ప్రియుడికి దూరం అవుతూ వచ్చిన యువతి ఇటీవల వేరే యువకుడితో వివాహం చేసుకోవాలని నిర్ణయించింది. వేరే యువకుడితో ప్రియురాలి పెళ్లి నిశ్చితార్థం జరిగిపోయింది. ఈ విషయం జీర్ణించుకోలేని ప్రియుడు ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలని అనేక ప్రయత్నాలు చేశాడు. చివరికి ఇంట్లో తన ప్రియురాలు ఒంటరిగా ఉందని తెలుసుకున్న యువకుడు నేరుగా అక్కడికి వెళ్లాడు. ప్రియురాలిని ఇంట్లో హత్య చేసిన ప్రియుడు వేరే ప్రాంతానికి పారిపోయి అక్కడ అతను ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ కేసులో ఎవ్వరూ ఊహించని ట్విస్ట్ తో అందరూ షాక్ అయ్యారు. అవేశంలో ప్రియుడు అసలు విషయం తెలుసుకోకుండా ప్రియురాలిని చంపేసి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు అంటున్నారు. యువతి మొబైల్ ఫోన్ లో వాట్సాప్ స్టేటస్ చూసిన ప్రియుడు రగిలిపోయి మూర్ఖంగా ఈ నిర్ణయం తీసుకున్నాడని పోలీసులు అంటున్నారు. అసలు ప్రియుడు, ప్రియురాలి విషయంలో ఎక్కడ పొరపాటు జరిగింది అనే అసలు విషయాన్ని పోలీసులు చెప్పారు.

బెంగళూరు శివార్లలో ప్రేమికులు

బెంగళూరు శివార్లలో ప్రేమికులు

కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలోని అంకోలకు చెందిన ఉషాగౌడ (24) అనే యువతి కుటుంబ సభ్యులతో కలిసి బెంగళూరు గ్రామీణ జిల్లాలోని లింగధీరమల్లసంద్ర గ్రామంలో నివాసం ఉంటున్నది. తమిళనాడుకు చెందిన గోపాలక్రిష్ణ (26) అనే యువకుడు హోసకోటే చేరుకుని అక్కడే నివాసం ఉంటున్నాడు. ఉషాగౌడ, గోపాలక్రిష్ణ ప్రేమించుకున్నారు.

పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు

పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు

గోపాలక్రిష్ణ ఓ ప్రైవేట్ కంపెనీలో మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్నాడు, నాలుగు సంవత్సరాల క్రితం గోపాలక్రిష్ణకు, ఉషాగౌడకు పరిచయం అయ్యింది. తరువాత గోపాలక్రిష్ణ, ఉషాగౌడ ప్రేమలోపడ్డారు. ఓకే ప్రాంతంలో నివాసం ఉంటున్న గోపాలక్రిష్ణ, ఉషాగౌడ నాలుగు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. మంచి జీతం తీసుకుంటున్న గోపాలక్రిష్ణ అతని ప్రియురాలు ఉషాను వివాహం చేసుకోవాలని అనుకున్నాడు.

 ప్రియురాలి వాట్సాప్ లో ఫోటోలు పెట్టింది

ప్రియురాలి వాట్సాప్ లో ఫోటోలు పెట్టింది

ఓ యువకుడితో ప్రియురాలు ఉషాగౌడ నిశ్చితార్థం జరిగిపోయిందని గోపాలక్రిష్ణకు తెలిసింది. ఉషాగౌడ మొబైల్ వాట్సాప్ స్టేటస్ లో ఓ యువకుడు ఆమెకు ఉంగరం తొడుగుతున్న ఫోటోలు చూసిన గోపాలక్రిష్ణ రగిలిపోయాడు. తనను కాకుండా వేరే యువకుడిని తన ప్రియురాలు ఉషా పెళ్లి చేసుకుంటున్నదని గోపాలక్రిష్ణ ఆవేశంలో ఊగిపోయాడు.

 ప్రియరాలిని చంపేసి ఆత్మహత్య

ప్రియరాలిని చంపేసి ఆత్మహత్య


లింగధీరమల్లసంద్ర గ్రామంలోని ఇంట్లో తన ప్రియురాలు ఉషాగౌడ ఒంటరిగా ఉందని తెలుసుకున్న గోపాలక్రిష్ణ నేరుగా అక్కడికి వెళ్లాడు. ప్రియురాలు ఉషాగౌడతో గొడవ పెట్టుకున్న గోపాలక్రిష్ణ ఆమె గొంతు నులిమేసి తల దిండుతో ఆమె ముఖం మీద అదిమి ఇంట్లో హత్య చేశాడు. తరువాత ప్రియుడు గోపాలక్రిష్ణ హోసకోటేకు చాలా దూరం ఉన్న తరబహళ్ళి గ్రామం సమీపంలోని 10 కిలోమీటర్ల దూరంలోని ప్రాంతానికి పారిపోయి అక్కడ అతను విషం సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు.

పెళ్లి కొడుకు కాదు.... టీచర్

పెళ్లి కొడుకు కాదు.... టీచర్


పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. ఉషా బెంగళూరు గ్రామీణ జిల్లాలోని హోసకోటేకి రాకముందు విజయపురలో ఓ స్కూల్ లో టీచర్ గా ఉద్యోగం చేసింది. ఆ సమయంలో ఆ స్కూల్ హెడ్ మాస్టర్ తో ఉషా సన్నిహితంగా ఉండేదని తెలిసింది. ఇటీవల హోసకోటేలో ఉషా బర్త్ డే పార్టీ జరుపుకుంది. ఆ బర్త్ డే పార్టీకి ఉషా గతంలో పని చేస్తున్న స్కూల్ హెడ్ మాస్టర్ కూడా హాజరైనాడని పోలీసులు అన్నారు.

 ప్రాణం తీసిన వాట్సాప్ ఫోటోలు

ప్రాణం తీసిన వాట్సాప్ ఫోటోలు

ఉషా మీద అభిమానంతో ఆమె పుట్టిన రోజు సందర్బంగా ఆ స్కూల్ హెడ్ మాస్టర్ ఓ ఉంగరం తీసిచ్చాడని, ఆ ఉంగరం ఉషాకు తొడుగుతున్న సమయంలో స్నేహితులు ఫోటోలు తీశారని, ఆ ఫోటోలు ఉషా ఆమె వాట్సాప్ లో స్టేటస్ పెట్టిందని పోలీసులు అన్నారు. హెడ్ మాస్టర్ బర్త్ డే జరుపుకుంటున్న ఉషాకు అభిమానంతో ఉంగరం తొడుగుతున్న సమయంలో తీసిన ఫోటోలను నిశ్చితార్థం ఫోటోలు అని పొరపాటు పడిన గోపాలక్రిష్ణ ఆమెను చంపేసి అతను ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు అంటున్నారు. ప్రియుడు గోపాలక్రిష్ణ ఆవేశంలో తీసుకున్న నిర్ణయంతో అతని ప్రాణాలతో పాటు ప్రియురాలు ఉషా ప్రాణాలు గాలిలో కలిసిపోవడం కలకం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+