Lovers: ముఖం చూడకుండా కాలేజ్ అమ్మాయితో లవ్, బ్యాంక్ ఉద్యోగి దెబ్బతో ?, సినిమా స్ట్రైల్ లో !

లక్నో/ఉత్తరప్రదేశ్: యువతి, యువకుడికి సోషల్ మీడియాలో పరిచయం అయ్యింది. అమ్మాయి కాలేజ్ లో చదువుతోంది. యువకుడు ప్రైవేట్ బ్యాంక్ లో ఉద్యోగం చేస్తున్నాడు. యువతి, యువకుడు ఒకరిని ఒకరు చూసుకోకుండా ప్రేమలేఖ సినిమాలో లాగా ప్రేమించుకున్నారు. అయితే చిన్న విషయంలో ప్రియుడు బెదిరించడంతో ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. ప్రియురాలు ఆత్మహత్య చేసుకుందని తెలుసుకున్న ప్రియుడు ఎస్కేప్ అయ్యాడు.

సోషల్ మీడియాలో పరిచయం

సోషల్ మీడియాలో పరిచయం

ఉత్తరప్రదేశ్ లోని బరేలీలోని ఓ ప్రైవేట్ కాలేజ్ లో చదువుకుంటున్న అమ్మాయికి, సంచిత్ అరోరా అలియాస్ సంచిత్ అనే యువకుడికి గత ఏడాది సోషల్ మీడియాలో పరిచయం అయ్యింది. కొంతకాలం సోషల్ మీడియాలో చాటింగ్ చేసుకున్న కాలేజ్ అమ్మాయి. సంచిత్ తరువాత ఫోన్ నెంబర్లు మార్చుకుని స్నేహితులు అయ్యారు.

 సినిమా స్టైల్లో ప్రేమించుకున్నారు

సినిమా స్టైల్లో ప్రేమించుకున్నారు

సంచిత్ ఓ ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. ఒకరని ఒకరు చూసుకోకుండా ప్రేమలో పడ్డారు. పెళ్లి రోజు మాత్రమే మనం ఒకరిని ఒకరు చూసుకోవాలని, అంత వరకు ఫోటోలు షేర్ చేసుకోకూడదని, వీడియో కాల్స్ లో మాట్లాడుకోకూడదని ఒప్పందం చేసుకున్నారు. సంవత్సరం నుంచి ఇద్దరు ఇలాగే ఒకరిని ఒకరు చూసుకోకుండా ప్రేమించుకున్నారు.

 40 సార్లు ఫోన్ చేసిన అమ్మాయి

40 సార్లు ఫోన్ చేసిన అమ్మాయి

వారం రోజుల క్రితం ప్రియుడు సంచిత్ అతని ప్రియురాలి ఫోటో పంపిచాలని చెప్పాడు. ముందుగా అనుకున్న మాట ప్రకారం ఫోటోలు పంపించను అని ప్రియురాలు తేల్చి చెప్పింది. నువ్వు ఫోటో పంపించకుంటే నేను రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంటానని ప్రియుడు సంచిత్ ఆమెను బెదిరించాడు. ప్రియుడు సంచిత్ తమాషా చేస్తున్నాడని ఆమె అనుకుంది. అయితే సుమారు 40 సార్లు ఫోన్ చేసినా సంచిత్ రిసీవ్ చెయ్యలేదు.

 ఆత్మహత్య చేసుకున్న ప్రియురాలు

ఆత్మహత్య చేసుకున్న ప్రియురాలు

తన ప్రియుడు నిజంగానే ఆత్మహత్య చేసుకున్నాడని భయపడిన కాలేజ్ అమ్మాయి బరేలీలోని ఆమె ఇంట్లో విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. మా అమ్మాయిని ఆత్మహత్య చేసుకునేలా సంచిత్ రెచ్చగొట్టాడని, అందుకే ఆమె ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. ప్రియురాలు ఆత్మహత్య చేసుకుందని తెలుసుకున్న ప్రియుడు సంచిత్ పరారైనాడని బరేలీ పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+