• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఎల్పీజీ సిలిండర్ ధర తగ్గింది: ఏప్రిల్ 1 నుంచి రూ. 10 తక్కువకే

|

హైదరాబాద్: ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు క్రమంగా తగ్గుతుండగా.. ఇప్పుడు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు కూడా తగ్గుముఖం పడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి గ్యాస్ సిలిండర్‌పై రూ. 10 తగ్గనుంది. ఈ మేరకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ బుధవారం వెల్లడించింది.

గురువారం నుంచి రూ. 10 తక్కువ ధరకే గ్యాస్ సిలిండర్ లభించనుంది. ప్రస్తుతం ఢిల్లీలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ. 819గా ఉండగా, కోల్‌కతాలో రూ. 845, ముంబైలో రూ. 819, చెన్నైలో రూ. 835గా ఉన్నాయి. ఒక్క 2021 సంవత్సరంలోనే మూడుసార్లు భారీగా గ్యాస్ ధరలు పెరిగిన విషయం తెలిసిందే.

 LPG cylinder price cut by Rs 10! New 14.2 kg cooking gas cylinder to cost Rs 809 from April 1

గ్యాస్ సిలిండర్‌పై సుమారు రూ. 125 పెరిగాయి. కాగా, ప్రస్తుతం అంతర్జాతీయ చమురు ధరలు తగ్గుతుండటంతో గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గుతాయని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.

'రిటైల్ రేట్లను నిర్ణయించడానికి బెంచ్ మార్క్ అయిన అంతర్జాతీయ చమురు ధరలు గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్నాన్నాయి. మంగళవారం ధరలను కొంత పెంచినప్పటికీ, మొత్తం ధోరణి క్షీణించింది, ఇది దేశీయ రిటైల్ రేట్లలో ప్రతిబింబించింది' అని సదరు అధికారి తెలిపారు.

'అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల ధరలు నవంబర్ 2020 నుండి స్థిరంగా పెరుగుతున్నాయి. భారతదేశం ఎక్కువగా ముడి చమురుపై దిగుమతి-ఆధారితంగా ఉన్నందున.. ధరలు మార్కెట్-అనుసంధానంగా ఉన్నందున, అంతర్జాతీయ ధరల పెరుగుదల ఫలితంగా పెట్రోలియం ఉత్పత్తుల దేశీయ ధరలు పెరిగాయి' అని ఐఓసి తెలిపింది.

*ఐరోపా, ఆసియాలో పెరుగుతున్న కోవిడ్ -19 కేసుల గురించి పెరుగుతున్న ఆందోళనలు, టీకా దుష్ప్రభావాల గురించి ఆందోళనలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తి ధరలు 2021 మార్చి రెండవ పక్షంలో నెమ్మదించాయి' అని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పేర్కొంది.

English summary
LPG cylinder price cut 2021: After raising cooking gas prices by Rs 125 per cylinder last month, state-owned oil firms on Wednesday announced a Rs 10 per cylinder cut in LPG rates on softening international oil prices.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X