LPG గ్యాస్ సిలిండర్ నుంచి LIC వరకు నేటి నుంచే కొత్త రూల్స్‌.. !

ప్ర‌స్తుతం దేశంలో పండుగ సీజ‌న్ న‌డుస్తోంది. ఇలాంటి ప‌రిస్థితిలో ప్ర‌భుత్వం, బ్యాంకులు వంటివి తీసుకునే నిర్ణయాలతో మ‌న బ‌డ్జెట్‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతాయి. క్యాలెండర్‌లో నెల మారగానే దేశంలోనూ రూల్స్‌ మారుతుంటాయి. నవంబర్‌లోనూ చాలా మార్పులే వచ్చాయి.

పెరిగిన గ్యాస్ ధ‌ర‌లు : గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌లు పెరిగాయి. అవి కూడా న‌వంబ‌ర్ 1 అంటే నేటి నుంచే అమ‌లు కానున్నాయి. దేశంలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర 103.50 రూపాయలు చొప్పున పెరిగింది. దీంతో ఈ పండుగ సీజన్‌లో బయటి ఆహార పదార్థాల ధరలు పెరిగే అవకాశం ఉంది. ఈ రోజు నుంచి, దిల్లీలో 19 కిలోల కమర్షియల్‌ LPG సిలిండర్ ధర 1,833 రూపాయలు, ముంబైలో 1,785.50 రూపాయలు, కోల్‌కతాలో 1,943 రూపాయలు, చెన్నైలో 1,999.50 రూపాయలు, హైదరాబాద్‌లో 1,863.50 రూపాయలు, విజయవాడలో 1,796 రూపాయల‌కు పెరిగింది. ఇళ్లలో వంటకు ఉపయోగించే డొమెస్టిక్‌ LPG ధర మారలేదు, పాత రేటునే OMCలు కొనసాగించాయి. 14 కిలోల గ్యాస్‌ సిలిండర్‌ హైదరాబాద్‌లో రూ.955, విజయవాడలో రూ.944.50 గా ఉంది.

LPG cylinder to LIC, Know the new rules starting from November 1st

GST లో మార్పు : నవంబర్ 1, నుంచి 30 తేది వ‌ర‌కూ అంటే ఈ ముప్పయి రోజుల్లో దేశంలో100 కోట్ల రూపాయ‌ల‌ కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపారాలు ఇ-వాయిస్ పోర్టల్‌లో GST ఇన్‌వాయిస్‌లను అప్‌లోడ్ చేయాలి. ఈ నిర్ణ‌యాన్ని GST అథారిటీ సెప్టెంబర్‌లోనే తీసుకుంది. అయితే, ఈ ముప్ప‌యివ తేదీలోపు ఆ ఇన్‌వాయిస్‌లోనూ అప్‌లోడ్ చేయాల్సిందేన‌ని నిర్ణ‌యించింది.

ATF రేటు త‌గ్గింది : ఈ పండుగ సీజన్‌లో విమాన ఇంధనం (ATF) ధరను తగ్గించారు. అది కూడా నేటి నుంచి అమ‌ల‌వుతుంది. రాజధాని దిల్లీలో ATF ధర కిలోలీటర్‌కు రూ. 6,854.25 తగ్గి రూ. 1,11,344.92కు చేరింది. ముంబైలో కిలోలీటర్ రూ.1,19,884.45 కాగా, కోల్‌కతాలో రూ.1,04,121.89కు చేరింది. అలాగే, చెన్నైలో కిలోలీటర్ రూ.1,15,378.97కు ల‌భిస్తుంది.

ఈక్విటీ డెరివేటివ్స్ ఛార్జీల పెంపు : బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) ఈక్విటీ డెరివేటివ్స్ విభాగంలో లావాదేవీల రుసుములు పెంచుతున్నట్లు అక్టోబరు 20వ తేదినే ప్రకటించింది. S&P BSE సెన్సెక్స్ ఫ్యూచర్స్ & ఆప్షన్స్‌లో ట్రేడ్‌ చేసే పెట్టుబడిదార్లపై ఇది నేరుగా ప్రభావం చూపే అవ‌కాశం ఉంది.

ల్యాప్ అయిన LIC పాలసీ రీ-ఓపెన్‌ : ఎల్‌ఐసీ పాలసీ ల్యాప్ అయిన‌వారు, దాని పునఃప్రారంభించుకునేందుకు అక్టోబర్31 2023 వ‌ర‌కూ అవ‌కాశం ఇచ్చింది. అయితే నిన్న‌టితో అది ముగిసింది. కాబ‌ట్టి లాస్ట్‌ డేట్‌ను పెంచుతూ ఈ రోజు కొత్త ప్రకటన రాకపోతే, లాప్స్‌ అయిన ఎల్‌ఐసీ పాలసీని కంటిన్యూ చేసేందుకు కొన్ని ఇబ్బందులు త‌ప్ప‌వు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+