Dream11: రూ. 49 పెట్టి గేమ్ ఆడాడు.. రూ. కోటిన్నర గెలిచాడు
Dream11: ఫాంటసీ క్రికెట్ గేమ్ డ్రీమ్11 యాప్‌లో గేమ్ ఆడి ఓ యువకుడు ఏకంగా కోటిన్నర రూపాయలను గెలుచుకున్నాడు. ఇంటింటికి గ్యాస్ అందించే ఆ యువకుడు ఒక్కసారిగా కోటీశ్వరుడుగా మారిపోయాడు. దీంతో అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. బీహార్ రాష్ట్రంలోని అరారియా జిల్లా సదర్ మండలం పటేగనా గ్రామానికి చెందిన సాదిక్ అనే యువకుడు ఈ భారీ మొత్తం గెలుచుకున్నాడు. కేవలం రూ. 49 పెట్టి డ్రీమ్11 యాప్‌లో గేమ్ ఆడి కోటిన్నర గెలవడం గమనార్హం.
వివరాల్లోకి వెళితే..సాదిక్ స్థానికంగా ఉండే ఉమా రాజ్ గ్యాస్ ఏజెన్సీలో గ్యాస్ డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేస్తున్నాడు. క్రికెట్‌పై ఆసక్తి కలిగిన సాదిక్.. జనవరి 14న జరిగిన భారత్- అఫ్గానిస్థాన్ మ్యాచ్‌లో రూ.49 పెట్టి డ్రీమ్-11లో ఫాంటసీ గేమ్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో 974.5 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచి రూ.కోటిన్నర గెలుచుకున్నాడు. ప్రస్తుతం సాదిక్ ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది.

ఈ సందర్భంగా సాదిక్ మాట్లాడుతూ.. ఈ విజయంతో మా కుటుంబ సభ్యులు చాలా సంతోషిస్తున్నారు. మకర సంక్రాంతి సందర్భంగా భారత్, అఫ్గానిస్థాన్ మ్యాచ్‌లో రూ.49తో గేమ్ ఆడాను. మిలియనీర్ కావాలనే నా కల కొన్ని గంటల్లోనే నెరవేరింది అని ఆనందం వ్యక్తం చేశాడు సాదిక్. కాగా, గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ సాదిక్ అప్పుడప్పుడు చిన్న మొత్తాలను గెలుచుకునేవాడు. ఈసారి మాత్రం ఏకంగా డ్రీమ్-11 గేమ్ టాలీ బోర్డ్‌లో తొలి స్థానం వచ్చిందని చెప్పాడు.
కాగా, ఈ విషయం చెబితే సాదిక్‌ను ఎవరూ నమ్మలేదు. పుకారుగా కొట్టిపారేశారు. కానీ సాదిక్ ఖాతాలోకి డబ్బు వచ్చేసరికి అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. దీంతో సాదిక్‌ను అభినందించేందుకు బంధువులు, మిత్రులు అతడి ఇంటికి క్యూ కడుతున్నారు. మరోవైపు, ఈ విషయంపై సాదిక్ పని చేసే ఉమా రాజ్ గ్యాస్ ఏజెన్సీ డైరెక్టర్ జితేంద్ర కుమార్ సింగ్ స్పందించారు. సాదిక్ బ్యాంకు ఖాతాకు డబ్బులు వచ్చిన వెంటనే వాటిని ఫిక్స్డ్ డిపాజిట్ చేశామని తెలిపారు.
-
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications