Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఒక షాక్ తరువాత ఇంకొకటి- నో ఇంటర్వెల్: గ్యాస్ సిలిండర్ల రేట్లను భారీగా పెంచిన కేంద్రం

LPG Cylinder Price: గృహావసరాల వంటగ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వాటి రేట్లను భారీగా పెంచింది. ఒక్కో సిలిండర్‌పై 50 రూపాయలను పెంచుతున్నట్లు పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కొత్త రేట్లు మంగళవారం తెల్లవారు జాము నుంచి అమలులోకి వస్తాయి. ఉజ్వల పథకానికి కూడా పెంపుదల వర్తింపజేసింది.

కొద్దిసేపటి కిందటే దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచింది కేంద్ర ప్రభుత్వం. పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై లీటర్ ఒక్కింటికి రెండు రూపాయల మేర పెంచింది. ఈ మేరకు ఆయిల్ కంపెనీలు ఓ ప్రకటన విడుదల చేశాయి. ఈ పెంపు- రిటైల్ అమ్మకాలకు వర్తించదంటూ పెట్రోలియం మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది.

LPG prices hiked by Rs 50 per cylinder effective from April 8

అదే సమయంలో గృహావసరాల ఎల్పీజీ వంటగ్యాస్ వినియోగదారులకు షాక్ తగిలింది. ఒక్కో సిలిండర్ మీద 50 రూపాయలు పెరిగింది. ఉజ్వల పథకం కింద నిరుపేద కుటుంబాలకు అందజేస్తోన్న సిలిండర్లపైనా ఈ తాజా వడ్డింపు వర్తింపజేయడం ప్రాధాన్యతను సంతరంచుకుంది.

గృహావసరాల కోసం వినియోగించే వంటగ్యాస్ కనెక్షన్ల ధరలో ఇప్పటివరకు ఎలాంటి మార్పు లేదు. వాటి రేట్లు యధాతథంగా కొనసాగుతూ వచ్చాయి ఇన్ని రోజులు. ఒక్కో సిలిండర్ ధర 803 రూపాయలు ఉంటోంది. ఇప్పుడు 853 రూపాయలకు పెరిగింది.

ఇదివరకు కేంద్ర ప్రభుత్వం దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు పంపిణీ చేసే గృహావసర వంటగ్యాస్ కనెక్షన్లు అంటే ఉజ్వల కింద సబ్సిడీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఒక్కో గ్యాస్ కనెక్షన్‌పై 200 రూపాయల సబ్సిడీని ఇచ్చిందప్పట్లో. ఇప్పుడు ఇందులో కూడా పెరుగుదల చోటు చేసుకుంది. అమాంతం 50 రూపాయలకు పెరిగింది.

503 నుంచి 553 రూపాయలకు పెరగడం చర్చనీయాంశమౌతోంది. ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ మార్కెట్‌లో చోటు చేసుకుంటోన్న పరిణామాల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం అటు- పెట్రోల్, డీజిల్, ఇటు- ఎల్పీజీ వంటగ్యాస్ రేట్లను పెంచిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

ఈ నెల మొదట్లో వాణిజ్య అవసరాల కోసం వినియోగించే 19 కేజీల సిలిండర్ ధరలను చమురు సంస్థలు తగ్గించిన విషయం తెలిసిందే. ఒక్కో సిలిండర్‌పై 41 రూపాయల మేర తగ్గింది. వాటి రేట్లను తగ్గించడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. జనవరిలో రూ. 14.50 పైసలు, ఫిబ్రవరిలో 7 రూపాయల మేర వాణిజ్య అవసరాలకు వినియోగించే వంటగ్యాస్ సిలిండర్ల రేట్లు తగ్గాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+