ఇండియన్ ఆర్మీ న్యూ చీఫ్‌గా లెఫ్టినెంట్ మనోజ్ పాండే: ఈ బాధ్యతలు చేపట్టనున్న తొలి ఇంజినీర్

న్యూఢిల్లీ: భారత సైన్యం 28వ సారథిగా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే బాధ్యతలు చేపట్టనున్నారు. నియామకాలపై ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేబినెట్ కమిటీ చర్చలు జరిపి.. మనోజ్ పాండేను సైన్యాధిపతిగా ఎంపిక చేసింది. ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ నరవాణే ఏప్రిల్ 30న పదవీ విరమణ చేయనున్నారు.

ఈ నేపథ్యంలో మనోజ్ పాండేను ఆయన వారసుడిగా కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. కార్ప్స్ ఆఫ్ ఇంజినీర్స్ నుంచి ఆర్మీ చీఫ్ కానున్న తొలి వ్యక్తి మనోజ్ పాండేనే కావడం విశేషం. ఆర్మీ చీఫ్ కోసం పాండే తోపాటు జైసింగ్ నయన్, అమర్ దీప్ సింగ్ బిందర్, యోగేంద్ర దిమ్రీ పేర్లను కేంద్రం పరిశీలించింది. వీరిలో అత్యంత సీనియర్ అయిన పాండేకే బాధ్యతలను అప్పగించింది.

 Lt General Manoj Pande Appointed As Indias New Army Chief: first engineer to this post

మనోజ్ పాండే ఎవరంటే..?

కాగా, లెప్టినెంట్ జనరల్ మనోజ్ పాండే ప్రస్తుతం ఆర్మీ​ వైస్ చీఫ్​గా ఉన్నారు. ఈయన మే 1న ఆర్మీ చీఫ్​గా బాధ్యతలు స్వీకరించనున్నారు.లెప్టినెంట్ జనరల్ పాండే నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థి. ఈయన 1982 డిసెంబరులో కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్‌ విభాగంలో నియమితులయ్యారు.

తన 39 ఏళ్ల సర్వీస్​లో కొంతకాలం జమ్మూకాశ్మీర్​లోని నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పల్లన్​వాలా సెక్టార్​లో ఇంజనీరింగ్ రెజిమెంట్​కు నాయకత్వం వహించారు. లెఫ్టినెంట్ జనరల్ పాండే వెస్ట్రన్ థియేటర్‌లో ఇంజనీర్ బ్రిగేడ్, నియంత్రణ రేఖ వెంబడి పదాతిదళ బ్రిగేడ్, లడఖ్ సెక్టార్‌లోని పర్వత విభాగం, ఈశాన్య భాగంలో కార్ప్స్‌కు నాయకత్వం వహించారు. ఆపరేషన్ పరాక్రమ్​లోనూ పాలుపంచుకున్నారు.

ఇది ఇలావుండగా, తదుపరి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్)పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గత ఏడాది డిసెంబరులో చివరి CDS జనరల్ బిపిన్ రావత్ చాపర్ ప్రమాదంలో మరణించినప్పటి నుంచి ఈ పోస్ట్ ఖాళీగా ఉంది. అయితే, సీడీఎస్‌గా ఎంఎం నరవణేను నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఎలాంటి నిర్ణయం వెలువడలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+