వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Lunar Eclipse 2022: భారత్‌లో చంద్రగ్రహణం ఎప్పుడు ఎక్కడ కనిపిస్తుంది..?

|
Google Oneindia TeluguNews

ఈ సంవత్సరం రెండవ చివరి చంద్రగ్రహణం నవంబరు 8వ తేదీన, రేపు ఏర్పడబోతుంది. ఈసారి చంద్రగ్రహణం మధ్యాహ్నం 2 గంటల 38 నిమిషాలకు ప్రారంభమై సాయంత్రం 4 గంటల 29 నిమిషాలకు ముగుస్తుంది. అయితే మధ్యాహ్న సమయాల్లో చంద్రగ్రహణం రావడంతో, అది కూడా భారత దేశంలో పాక్షిక చంద్ర గ్రహణం ఉండడంతో చంద్ర గ్రహణాన్ని మనం చూసే అవకాశం లేదు. అయినప్పటికీ చంద్రగ్రహణం ప్రభావం మనపై ఉంటుందని, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

భారత దేశంలో చివరిసారిగా 2018 జూలై 27 -28వ తేదీ రాత్రి సంభవించింది. సూర్య చంద్రుల మధ్య భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. సూర్యుడు నుంచి వచ్చే కిరణాలు చంద్రుడిపై పడకుండా భూమి అడ్డుకుంటుంది. దీన్నే చంద్రగ్రహణం అని పిలుస్తాము. ఇక చంద్రగ్రహణం పై మినిట్ టూ మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం.

Lunar Eclipse in India live updates in telugu.

Newest First Oldest First
6:29 PM, 8 Nov

తెలుగు రాష్ట్రాల్లో 39 నిమిషాల పాటు కనిపించిన గ్రహణం
6:29 PM, 8 Nov

తెలుగు రాష్ట్రాల్లో స్పష్టంగా కనిపించిన గ్రహణం
5:23 PM, 8 Nov

కోల్‌కతా, భువనేశ్వర్, ఢిల్లీ, శ్రీనగర్, చెన్నై, గాంధీనగర్, ముంబై, హైదరాబాద్‌లో పాక్షికంగా కనిపిస్తుంది
5:22 PM, 8 Nov

చంద్రగ్రహణం ఇటానగర్, గువాహటి, సిలిగురి ప్రాంతాల్లో మాత్రమే పూర్తిగా కనిపిస్తుంది.
5:21 PM, 8 Nov

హైదరాబాదులో 46 నిమిషాలపాటు కొనసాగి 7.26 గంటలకు ముగియనున్న గ్రహణం
5:21 PM, 8 Nov

హైదరాబాదులో చంద్రగ్రహణం వేళలు: సాయంత్రం 5.40 గంటలకు ప్రారంభం కానున్న గ్రహణం
4:29 PM, 8 Nov

భారత్‌లో ప్రారంభమైన చంద్రగ్రహణం
3:47 PM, 8 Nov

సాయంత్రం 6గంటల 19 నిమిషాల వరకు కొనసాగనున్న పాక్షిక చంద్రగ్రహణం
3:46 PM, 8 Nov

సంపూర్ణ చంద్రగ్రహణం మధ్యాహ్నం 3:46 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5:12 గంటలకు ముగుస్తుంది
3:46 PM, 8 Nov

ఉత్తర అమెరికా దక్షణి అమెరికాలో పాక్షిక చంద్రగ్రహణం
3:45 PM, 8 Nov

ఈ ఏడాది చివరి సంపూర్ణ చంద్రగ్రహణం ప్రారంభం
12:55 PM, 8 Nov
ఆంధ్రప్రదేశ్

చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం మాత్రం గ్రహణ సమయంలోనూ తెరిచే ఉంటుంది. మహాశివుడు శ్రీకాళహస్తీశ్వరుడిగా దర్శనం ఇస్తారిక్కడ. గ్రహణ సమయంలో ప్రత్యేకంగా రుద్రాభిషేకాలు, పూజలను నిర్వహిస్తారు.
12:25 PM, 8 Nov
ఆంధ్రప్రదేశ్

చంద్ర గ్రహణం నేపథ్యంలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయాన్ని మూసివేసిన అర్చకులు. ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలు మూసివేత.
11:51 AM, 8 Nov

చంద్రగ్రహణం నేపథ్యంలో హైదరాబాద్‌‌లోని పెద్దమ్మ తల్లి ఆలయం, చిల్కూర్ బాలాజీ ఆలయం సహా అన్ని దేవాలయాలను అర్చకులు మూసివేశారు. సంప్రోక్షణ అనంతరం దర్శనాలకు అనుమతి ఇస్తారు.
10:57 AM, 8 Nov

అస్సాం, మేఘాలయ, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, బిహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌తో పాటు పశ్చిమ, ఉత్తర-దక్షిణాది ప్రాంతాల్లో చంద్రగ్రహణాన్ని చూడొచ్చు.
10:36 AM, 8 Nov

భారత్‌లో చివరి చంద్రగ్రహణం 2021 నవంబర్ 19వ తేదీన ఏర్పడింది. అది పాక్షిక చంద్రగ్రహణం.
10:18 AM, 8 Nov

దేశంలో మళ్లీ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని చూడాలంటే మూడు సంవత్సరాల పాటు ఎదురు చూడాల్సి ఉంటుంది. తదుపరి సంపూర్ణ చంద్ర గ్రహణం 2025 మార్చిలో ఏర్పడుతుంది.
10:06 AM, 8 Nov

దేశంలో తదుపరి చంద్ర గ్రహణం 2023 అక్టోబర్ 28వ తేదీన ఏర్పడుతుంది. ఇది కూడా పాక్షికమే.
9:46 AM, 8 Nov

దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రం తీర దేశాల ప్రజలు ఈ చంద్ర గ్రహణాన్ని వీక్షించగలరు.
9:31 AM, 8 Nov

చంద్రగ్రహణం నేపథ్యంలో ఏపీ, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా పలు ఆలయాలు మూతపడ్డాయి.
8:56 AM, 8 Nov

కోల్‌కత, భువనేశ్వర్, న్యూఢిల్లీ, శ్రీనగర్, చెన్నై, గాంధీనగర్, ముంబై వంటి ప్రాంతాల్లో చంద్ర గ్రహణం పాక్షికంగా కనిపిస్తుంది.
8:44 AM, 8 Nov

అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, పశ్చిమ బెంగాల్ ఉత్తర ప్రాంత ప్రజలు సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని చూసే అవకాశం ఉంది.
8:31 AM, 8 Nov
ఉత్తర్ ప్రదేశ్

చంద్రగ్రహణం నేపథ్యంలో కాన్పూర్‌లో ఆలయాల తలుపులను అర్చకులు మూసిివేశారు. కార్తీక పౌర్ణమి కావడం వల్ల బయటి నుంచే భక్తులు ప్రత్యేక పూజలను నిర్వహించారు.
8:25 AM, 8 Nov

దేశం మొత్తంగా సంపూర్ణ చంద్ర గ్రహణం కనిపించదు. ఈశాన్య ప్రాంతంలో నివసించే ప్రజలు మాత్రమే దీన్ని వీక్షించే అవకాశం ఉంది.
8:14 AM, 8 Nov

చంద్ర గ్రహణాన్ని దృష్టిలో ఉంచుకుని తిరుమల శ్రీవారి ఆలయం తలుపులను అర్చకులు మూసివేశారు. గ్రహణ కాలం ముగిసిన తరువాత సంప్రోక్షణ అనంతరం తిరిగి తెరుస్తారు.
7:29 PM, 7 Nov

సూర్యుడికి చంద్రుడికి మధ్యలో భూమి వచ్చిన సమయంలో గ్రహణం ఏర్పడుతుంది
7:29 PM, 7 Nov

భారత్‌లో పాక్షికంగా కనిపించనున్న గ్రహణం
7:28 PM, 7 Nov

ఈ ఏడాదిలో చివరి గ్రహణం కావడం విశేషం
7:28 PM, 7 Nov

భారత్‌లో మధ్యాహ్నం 2 గంటల 38 నిమిషాలకు ప్రారంభమై సాయంత్రం 4 గంటల 29 నిమిషాలకు ముగియనున్న చంద్ర గ్రహణం
7:27 PM, 7 Nov

నవంబర్ 8వ తేదీన చంద్రగ్రహణం
READ MORE

English summary
Lunar Eclipse in India live updates in telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X