Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Madam: కొడుకును చంపిన తల్లి, వాట్సాప్ గ్రూప్స్ లో ఫ్రెండ్స్, షాహీదాకు ఉగ్రవాదులతో లింక్ ?

కొచ్చి/ కేరళ/ మదనపల్లె: దేవుడికి నరబలి ఇస్తే అంతా మంచే జరుగుతుందని తాను తన కన్న కొడుకుని హత్య చేశానని లేడీ టీచర్ పోలీసుల విచారణలో అంగీకరించింది. కొడుకును హత్య చేసిన తల్లి స్వయంగా పోలీసులకు చెప్పడంతో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొడుకును చంపిన లేడీ టీచర్ మొబైల్ లో అనేక వాట్సాప్ గ్రూప్ లు ఉన్నాయని, ఆ గ్రూప్స్ లో నిందితురాలు చాలా చురుకుగా ఉందని పోలీసులు గుర్తించారు. లేడీ టీచర్ కు ఉగ్రవాదులతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా ? అనే కోణంలో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు.

పాలక్కాడ్ మదరసాలో !

పాలక్కాడ్ మదరసాలో !

కేరళలోని పాలక్కాడ్ లోని పుత్తుపల్లి రోడ్డులో సులేమాన్, షాహిదా (30) అనే దంపతులు నివాసం ఉంటున్నారు. సులేమాన్, షాహీదా దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. సేలేమాన్, షాహీదా దంపతుల ముగ్గురు పిల్లల్లో అదిల్ (6) అనే కొడుకు చివరివాడు. షాహీదా చాలా కాలం నుంచి పాలక్కాడ్ లోని ఓ ప్రముఖ మదరసాలో టీచర్ గా ఉద్యోగం చేస్తోంది.

దైవభక్తితో ఊగిపోయిన లేడీ టీచర్

దైవభక్తితో ఊగిపోయిన లేడీ టీచర్

షాహీదా ప్రస్తుతం గర్బవతి. సులైమాన్ ట్యాక్సీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. షాహీదాకు దైవభక్తి చాలా ఎక్కువ. దానికితోడు మదరసాలో టీచర్ గా ఉద్యోగం చేస్తున్న షాహీదా నిత్యం అక్కడ చదువుకునే పిల్లలకు దేవుడి గురించి, దేవుడి మహిమల గురించి భోదిస్తోంది. నిత్యం షాహీదా అతిగా దైవభక్తితో ఊగిపోయేదని తెలిసింది.

ఇద్దరు పిల్లలు బతికిపోయారు

ఇద్దరు పిల్లలు బతికిపోయారు

రాత్రి భోజనం చేసిన తరువాత సులైమాన్ ఇద్దరు పిల్లలతో కలిసి ఓ గదిలో నిద్రపోయాడు. లేడీ టీచర్ షాహీదా, ఆమె చిన్న కొడుకు అదిల్ మరో గదిలో నిద్రపోయారు. ఇద్దరు పిల్లలు తండ్రితో కలిసి నిద్రపోవడంతో వారి ప్రాణాలు మిగిపోయాయి. వేకువ జామున నాలుగు గంటల సమయంలో షాహీదా ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం కన్న కొడుకు అదిల్ ను నిద్రలేపి బాత్ రూమ్ లోకి పిలుచుకుని వెళ్లింది.

 చంపేసి ఫోన్ చేసి చెప్పింది

చంపేసి ఫోన్ చేసి చెప్పింది

దేవుడు ఆదేశించాడని, తాను కచ్చితంగా ఆ పని చెయ్యాలని ఊహించుకున్న షాహీదా కొడుకు అదిల్ ను బాత్ రూమ్ లోకి పిలుచుకుని వెళ్లిన తరువాత అతని కాళ్లు చేతులు కట్టేసి పదునైన కత్తి తీసుకుని అతని గొంతు చీల్చేసి అతి దారుణంగా చంపేసింది. కొడుకును దారుణంగా చంపేసిన షాహీదా ఈ లోకంలోకి వచ్చి తాను తప్పు చేశానని తెలుసుకుని స్వయంగా స్థానిక పోలీసులకు ఫోన్ చేసి చెప్పింది.

పక్క వీధిలో కత్తి కొనింది

పక్క వీధిలో కత్తి కొనింది


షాహీదా ఆమె కొడుకును హత్య చెయ్యడానికి మొదట ఇంట్లో ఉన్న కత్తిని సెలెక్ట్ చేసుకుంది. ఇంట్లో కత్తికి పదును లేకపోవడంతో ఆమె నివాసం ఉంటున్న పక్క వీధిలోని ఓ షాప్ లో పదునైన కత్తి కొనుగోలు చేసిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. కొన్ని రోజుల క్రితమే షాప్ లో షాహీదా కొత్త కత్తి కొనుగోలు చేసిందని పోలీసులు అన్నారు.

మేడమ్ ఫోన్ లోవాట్సాప్ గ్రూప్ లు

మేడమ్ ఫోన్ లోవాట్సాప్ గ్రూప్ లు

షాహీదా కొడుకు అదిల్ ఒకటవ తరగతి చదువుతున్నాడు. కొడుకును హత్య చేసిన షాహీదాను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. షాహీదా మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆ ఫోన్ లోని వివరాలు సేకరించారు. లేడీ టీచర్ షాహీదా మొబైల్ ఫోన్ లో అనేక వాట్సాప్ గ్రూప్ లు ఉన్నాయని పోలీసులు అన్నారు.

ఉగ్రవాదులతో లింక్ ఉందా ?

ఉగ్రవాదులతో లింక్ ఉందా ?

ఉగ్రవాదులతో షాహీదాకు ఏమైనా లింక్ ఉందా ? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. షాహీదా ప్రస్తుతం గర్బవతి. కడుపులో ఓ బిడ్డ పెరుగుతున్న సమయంలోనే కళ్ల ముందు ఉన్న మరో బిడ్డను షాహీదా ఇంత దారుణంగా హత్య చెయ్యడంతో అనేక అనుమానాలు ఉన్నాయని పాలక్కాడ్ పోలీసు అధికారులు అంటున్నారు. ప్రస్తుతం షాహీనా మొబైల్ ఫోన్ లోని వాట్సాప్ గ్రూప్స్ ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+