బెదిరింపులు: రక్షణ కోరుతూ డీజీపీకి లేఖ రాసిన యువ ఐఏఎస్ అధికారి లోకేష్
భోపాల్: తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, పోలీసు ప్రొటెక్షన్ కావాలంటూ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న యువ ఐఏఎస్ అధికారి లోకేష్ కుమార్ జంగిడ్ అభ్యర్థిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ప్రైవేట్ మెసేజింగ్ యాప్ 'సిగ్నల్'లో ఐఏఎస్ అధికారుల గ్రూప్‌లో రాష్ట్ర అధికారులపై అవినీతి ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆయనకు పలువురి నుంచి బెదిరింపులు వచ్చాయి. దీంతో తనకు రక్షణ కల్పించాలని రాష్ట్ర డీజీపీని కోరుతున్నారు.
2014 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి లోకేష్ కుమార్.. ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్నాడు. అయితే, 'సిగ్నల్' అనే ప్రైవేట్ మెసేజింగ్ యాప్‌లోని ఐఏఎస్ అధికారుల గ్రూప్‌లో.. కొందరు రాష్ట్ర ప్రభుత్వ అధికారులపై అవినీతి ఆరోపణలు చేశారు. అవి కాస్త లీక్ అవ్వడంతో ఆయనకు ప్రభుత్వం నోటీసులు పంపింది. క్రమశిక్షణారాహిత్య చర్యలుగా పేర్కొంది. వారంలోగా సమాధానం చెప్పాలని ఆదేశించింది.

మరోవైపు అవినీతి ఆరోపణలు చేసిన నాటి నుంచి లోకేష్‌కు బెదిరింపులు వస్తున్నాయి.
రెండ్రోజుల క్రితంనాటి రాత్రి 11 గంటల సమయంలో ఓ కొత్త నెంబర్ నుంచి తనకు ఫోన్ కాల్ వచ్చిందని.. ఫోన్లో ఓ వ్యక్తి తనను మీడియాతో మాట్లాడటం మానేయాలని, ఆరు నెలలపాటు లీవ్ మీద వెళ్లాలని చెప్పాడని.. అంతేగాక, అలా చేయకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించినట్లు వాపోయారు.
ఈ నేపథ్యంలోనే తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని లోకేష్.. మధ్యప్రదేశ్ డీజీపీని కోరారు. ఈ మేరకు డీజీపీ వివేక్ జోహ్రీకి లేఖ రావడంతో.. భోపాల్ పోలీసులు బెదిరింపులపై దర్యాప్తు చేపట్టారు. కాగా, వ్యక్తిగత కారణాలను చూపుతూ లోకేష్ తన సొంత రాష్ట్రం మహారాష్ట్రకు తనను డిప్యూటేషన్‌పై పంపాలని కోరారు. తాను అవినీతి సహించనని, అందుకే తనను 9 సార్లు బదిలీ చేశారని లోకేష్ ఆ ప్రైవేట్ చాట్‌లో పేర్కొన్నాడు.
Recommended Video
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications