బోరుబావిలో మూడేళ్ల చిన్నారి: 24 గంటలుగా: నిరంతరాయంగా సహాయక చర్యలు: అయినా

భోపాల్: మధ్యప్రదేశ్‌లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. మూడేళ్ల చిన్నారి బోరుబావిలో పడిపోయాడు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక, ప్రకృతి వైపరీత్యాల నిర్వహణా విభాగం సిబ్బంది, రెవెన్యూ అధికారులు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలను చేపట్టారు. బోరుబావి నుంచి ఆ చిన్నారిని ప్రాణాలతో బయటికి తీసుకుని రావడానికి 24 గంటలుగా నిరంతరాయంగా సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

సహాయక చర్యలను వేగవంతం చేయడానికి సైన్యాన్ని రప్పించారు. అయినప్పటికీ.. ఆ బాలుడు ఉన్న ప్రదేశానికి చేరుకోలేకపోతున్నారు. సమయం గడుస్తున్న కొద్దీ ప్రాణాలతో తిరిగి వస్తాడనే ఆశలు నీరుగారుతున్నాయి. బోరుబావిలోకి ఆక్సిజన్‌ను పంపిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని నివారీ జిల్లాలోని సేతుపురా బారా గ్రామంలో బుధవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ బాలుడి పేరు ప్రహ్లాద్.

Madhya Pradesh: Rescue operations continue to save a 3-year old boy who fell into an borewell

పృథ్వీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సేతుపురా బారా గ్రామానికి చెందిన హరికిషన్ కుష్వాహా అనే రైతు కుమారుడు. రెండెకరాల పొలంలో కొద్దిరోజుల కిందటే ఆయన బోర్ వేయించాడు. అందులో నీళ్లు పడ్డాయి. ప్రస్తుతం కేసింగ్ వేసే పనులను కొనసాగిస్తున్నారు. బోరుబావి సుమారు 400 అడుగుల లోతులో ఉన్నట్లు చెబుతున్నారు. బుధవారం ఉదయం పొలంలో ఆడుకుంటూ పొరబాటున బోరుబావిలో పడిన ప్రహ్లాద్ సుమారు 40 అడుగుల లోతులో చిక్కుకుని ఉన్నట్లు గుర్తించారు.

బోరుబావిలో పడిన సమాచారం అందుకున్న వెంటనే సహాయక చర్యలను చేపట్టారు. అవి ఇంకా కొనసాగుతున్నాయి. బోరుబావి నుంచి ప్రహ్లాద్ సురక్షితంగా రావాలని గ్రామస్తులు ప్రార్థిస్తున్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. సైతం ఈ ఘటనపై స్పందించారు. బాలుడు ప్రాణాలతో తిరిగి రావాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. 24 గంటలు గడిచినప్పటికీ.. ప్రహ్లాద్ చిక్కుకుని ఉన్న ప్రదేశానికి చేరుకోలేకపోవడం వల్ల ఆందోళన వ్యక్తమౌతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+