Madras High Court: భార్య పోర్న్ చూసిందని.. హస్తప్రయోగం చేసిందని విడాకులు ఇవ్వలేం..
Madras High Court: భార్య పోర్న్ చూడడం, హస్తప్రయోగం చేసుకోవడం వైవాహిక బంధంలో క్రూరత్వం కిందకు రాదని మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఓ వ్యక్తి తన భార్య అశ్లీల చిత్రాలను చూస్తోందని.. తరచూ హస్తప్రయోగం చేస్తుందనే కారణంతో విడాకులు కోరుతూ పిటిషన్ దాఖలు చేయగా.. దానిని న్యాయస్థానం తోసిపుచ్చింది. పురుషులు హస్తప్రయోగం సార్వత్రికమైనదిగా పరిగణించబడినప్పుడు.. స్త్రీలు చేసే హస్తప్రయోగాన్ని కళంకం చేయకూడదన్నారు. వారు వివాహం చేసుకున్న తర్వాత వారి లైంగిక స్వయంప్రతిపత్తిని వదులుకోరని మద్రాస్ హైకోర్టు పేర్కొంది. గోప్యత ప్రాథమిక హక్కులో వ్యక్తిగత గోప్యత కూడా భాగమేనని తేల్చి చెప్పింది.
అది క్రూరత్వం కాదు..
ఒక మహిళ ఏకాంతంగా పోర్న్ చూడటం, హస్తప్రయోగం చేసుకోవడం తన భర్త పట్ల క్రూరత్వంగా పరిగణించబడదని ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును మద్రాస్ హైకోర్టు సమర్థించింది. ఈ కారణం చేత కుటుంబ కోర్టు ఒక వ్యక్తికి విడాకులు ఇవ్వడానికి నిరాకరించింది. "పురుషులు హస్తప్రయోగం తర్వాత వెంటనే లైంగిక సంబంధంలో పాల్గొనకపోవచ్చు కానీ మహిళల విషయంలో అలా జరగదు. భార్యకు హస్తప్రయోగం చేసే అలవాటు ఉంటే భార్యాభర్తల మధ్య వైవాహిక సంబంధం ప్రభావితం అవుతుందని కూడా నిర్ధారించబడలేదు" అని న్యాయమూర్తులు జస్టిస్ జీఆర్ స్వామినాథన్, జస్టిస్ ఆర్.పూర్ణిమలతో కూడిన డివిజన్ బెంచ్ బుధవారం పేర్కొంది. ఒక స్త్రీ వివాహం తర్వాత వివాహేతర సంబంధం కలిగి ఉంటే.. అది విడాకులకు కారణం కావచ్చు. కానీ స్వీయసుఖంలో మునిగిపోవడం వివాహాన్ని రద్దు చేసుకోవడానికి కారణం కాకూడదని.. అది భర్తపట్ల క్రూరత్వం అని ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పలేమని న్యాయస్థానం పేర్కొంది.


అశ్లీల చిత్రాలు చూడడం నేరం కాదు..
అశ్లీల చిత్రాలను చూడడంలో భార్యాభర్తలు చట్టబద్దమైన చట్టాలను ఉల్లంఘించకపోతే.. అటువంటి అలవాటు దాంపత్య జీవితంపై ప్రభావం చూపకపోతే.. అటువంటి చర్యలు క్రూరత్వంగా పరిగణించబడవని.. అందువల్ల అవి విడాకులకు కారణం కావని.. మద్రాసు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జీఆర్ స్వామినాథన్, జస్టిస్ ఆర్.పూర్ణిమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రైవేట్ వాతావరణంలో అశ్లీల చిత్రాలు చూడటం నేరం కాదని కోర్టు తీర్పును వెలువరించింది.
తమిళనాడు వ్యక్తి
తమిళనాడులోని కరూర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తన భార్య నుంచి విడాకులు ఇచ్చేందుకు నిరాకరించిన కుటుంబ న్యాయస్థానం ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా మద్రాసు హైకోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. తన భార్య పోర్న్ చూసేందుకు బానిసైందని.. తరచూ హస్తప్రయోగానికి పాల్పడుతోందని.. ఇంట్లో పనులు చేయడానికి కూడా నిరాకరిస్తోందని ఆ వ్యక్తి ఆరోపించారు. తన భార్య లైంగిక సంబంధ వ్యాధితో బాధపడుతోందని పిటిషనర్ ఆరోపంచారు. కానీ నిర్ధారించడానికి ఎలాంటి పత్రాలను సమర్పించలేదు. 2018లో ఆ దంపతులకు వివాహం జరగగా.. 2020 డిసెంబర్ నుంచి విడివిడిగా ఉంటున్నారు. భార్య పోర్న్ బాగా చూస్తోందని.. తరచూ హస్తప్రయోగం చేస్తూ క్రూరత్వం ప్రదర్శిస్తోందని ఆ భర్త విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశాడు.












Click it and Unblock the Notifications