Mahakumbh Mela 2025: ప్రయాగ్‌రాజ్ వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్ - ఇక్కడే కీలకం..!!
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా ప్రారంభమైంది. 45 కోట్ల మంది భక్తుల కోసం ప్రయాగ్ రాజ్ సిద్దమైంది. ఈ ఉదయ బ్రహ్మ ముహూర్తాన కుంభమేళా ఆరంభ మైంది. గంగా, యమునా, సరస్వతీ నదుల త్రివేణీ సంగమం లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తుల కోసం యూపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. కృత్రిమ మేధ సహకారంతో దీనిని డిజిటల్ కుంభమేళాగా మార్చేసింది. ఇదే సమయంలో కుంభమేళాకు ఆరు ముహూర్తాలు కీలకం గా ఉన్నాయి. ఈ ముహూర్తాల్లో వచ్చే భక్తులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.
భక్తజన సంద్రంగా
మహా కుంభమేళా సరంభం ఆరంభమైంది. యూపీ ప్రభుత్వం ప్రయాగ్ రాజ్ ను టెంట్ సిటీగా మార్చింది. దాదాపు రూ 7 వేల కోట్ల ఖర్చుతో భారీ ఏర్పాట్లు చేసింది. భద్రతతోపాటు సౌకర్యాల కోసం ఆధునిక సాంకేతిక సహకారాన్ని విస్తృతంగా వాడుకుంటోంది. 10 వేల ఎకరాల పరిధిలో ఈ ఆధ్యాత్మిక నగరాన్ని ఏర్పాటు చేశారు. యాత్రికులకు ఇబ్బంది లేకుండా 1.6 లక్షల టెంట్లను, 1.5 లక్షల మరుగు దొడ్లను నిర్మించారు. భద్రత కోసం 55 పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. 45,000 మంది పోలీసులను మోహరించారు.

ప్రత్యేక ఏర్పాట్లు
ఇక, సాధువులకు సంబంధించిన 13 అఖాడాలు కుంభమేళాలో భాగం కానున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సాధువులు, సాధ్వీలు, నాగా సాధువులు, కల్పవాసీలు, భక్తులకు స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. తెలుగుతోపాటు ప్రాంతీయ, అంతర్జాతీయ భాషల్లోనూ సేవలందించే కాల్ సెంటర్లను ఏర్పాటు చేశారు. దేశంలో అన్ని ప్రముఖ నగరాల నుంచి ప్రయాగ్‌రాజ్‌కు విమాన కనెక్టివిటీని మెరుగుపరచేలా అలయన్స్ ఎయిర్‌తో పార్ట్‌నర్‌షిప్ డీల్ కుదిరింది. ప్రయాగ్‌రాజ్‌లో 5 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇన్‌క్రెడిబుల్ ఇండియా పెవిలియన్‌ను పర్యాటక శాఖ సిద్ధం చేసింది.

పవిత్ర స్నానాలు
విదేశీ అతిథుల కోసం 1.3.6.3 నంబర్‌తో టోల్ ఫ్రీ ఇన్ఫో లైన్‌ను పర్యటక శాఖ ఏర్పాటు చేసింది. ఇంగ్లిష్, హిందీ, ఇతర భారతీయ భాషలతో పాటు 10 ప్రముఖ విదేశీ భాషలలో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక, కుంభమేళా లో ఈ ఆరు ముహూర్తాలు పవిత్ర స్నానాలకు ముఖ్యమైన రోజులు కావటంతో..ఈ వేళ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. నేడే పుష్యపౌర్ణమి. ఈ రోజు కుంభమేళా ప్రారంభం కాగా..14న మకర సంక్రాంతి, 29న మౌని అమావాస్య, ఫిబ్రవరి 3న వసంత పంచమి, ఫిబ్రవరి 12న మాఘ పౌర్ణమి, 26న మహా శివరాత్రి సందర్భంగా కుంభమేళాకు భారీగా భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించనున్నారు.












Click it and Unblock the Notifications