డ్యాన్స్‌కు బ్రేక్: బార్‌లలో యువతుల చిందులు బంద్!

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబై బార్లలో డ్యాన్స్‌ను నిషేధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ వర్షాకాల సమావేశంలో ఈ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. ఈ సమావేశాల్లో బార్లలో డ్యాన్సులను నిషేధించే బిల్లును ప్రవేశ పెడతామని మహారాష్ట్ర హోంమంత్రి ఆర్ఆర్ పాటిల్ గురువారం చెప్పారు.

మహారాష్ట్రలో వర్షాకాల సమావేశాలు జూన్ రెండో తేది నుండి ప్రారంభం కానున్నాయి. సమావేశాల్లో పదమూడు బిల్లులు పెట్టాలని నిర్ణయించుకున్నారు. అందులో బార్లలో డాన్సులను నిషేధించే బిల్లు కూడా ఉంది. తాము న్యాయస్థానం సూచనలను పరిగణలోకి తీసుకొని బిల్లులో మార్పులు చేర్పులు చేసినట్లు ఆర్ ఆర్ పాటాల్ చెప్పారు.

Maharashtra govt plans new bill to ban dance bars in Mumbai

కాగా, తొంబైకి పైగా బార్ల యజమానులు తమ లైసెన్సులు పునరుద్ధరించడం లేదంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిపై వివరణ ఇవ్వాలని సుప్రీం కోర్టు మహా ప్రభుత్వాన్ని ఆదేశించింది. సుప్రీం కోర్టుకు తాము వివరణ ఇస్తామని అధికారులు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా.. ఆర్ ఆర్ పాటిల్ మాట్లాడుతూ... బార్లలో డ్యాన్స్ నిషేధం పైన గతంలో ప్రభుత్వం అమలు చేసిన చట్టంలోని లోపాలను సరిదిద్దడానికి మరింత పటిష్ట సవరణ తేవాలా లేక కొత్త బిల్లును తీసుకు రావాలా అనే విషయమై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+