కన్నడిగులు ఎవరు సీఎం కావాలని కోరుకుంటున్నారంటే ?, సిట్టింగ్ సీఎంకు ఎంత మెజారిటీ !!

బెంగళూరు/మైసూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల కౌంట్ డౌన్ మొదలైయ్యింది. ఇప్పటికే 124 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో మంచి ఊపు మీద ఉంది. అయితే ఇప్పటి వరకు అభ్యర్థుల జాబితాను విడుదల చెయ్యకుండా బీజేపీ నాయకులు చర్చలు జరుపుతున్నారు. బీజేపీ ఆచితూచి వ్యవహరిస్తోంది. అయితే ముఖ్యమంత్రి ఎవరు అయితే బాగుంటుంది అని ఓ మీడియా సర్వే చెయ్యగా చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకుడు సిద్దరామయ్య పేరు చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా ఏబీపీ న్యూస్ సీ ఓటర్ సర్వే నిర్వహిచింది. కర్ణాటకలో మళ్లీ ఎవరు అధికారంలోకి వస్తారు ?, ఏపార్టీకి సంపూర్ణ మెజారీ వస్తుంది, బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్, ఇతరుకుల ఎన్ని సీట్లు వస్తాయి, ఎవరు ముఖ్యమంత్రి అయితే ప్రజలు సంతోషంగా ఉంటారు అంటూ ఏబీపీ న్యూస్- సీ ఓటర్ సర్వే నిర్వహిచింది.

Majority of Kannadigas want Siddaramaiah to be CM of Karnataka

పలు నియోజక వర్గాలు, నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో సర్వే జరిగింది. ఈ సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య మరోసారి సీఎం అయితే బాగుంటుంది అని 39.1 శాతం మంది ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు. కర్ణాటక సిట్టింగ్ సీఎం బసవరాజ్ బోమ్మయ్ మరోసారి సీఎం అయితే బాగుంటుంది అని 31.1 శాతం మంది ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారని సర్వే నివేదిక తెలిపింది.

21.4 శాతం మంది ప్రజలు మాజీ సీఎం హెచ్.డీ. కుమారస్వామి సీఎం కావాలని కోరుకుంటున్నారని, వారిలో బ్రాహ్మణులు ఎక్కువ శాతం మంది కుమారస్వామికి మద్దతు ఇస్తున్నారని సర్వే తెలిపింది. అయితే కాంగ్రెస్ లో పవర్ ఫుల్ లీడర్, ట్రబుల్ షూటర్, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ సీఎం కావాలని కేవలం 3. 2 శాతం మంది మాత్రమే కోరుకుంటున్నారని సర్వే తెలపడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు షాక్ అయ్యారు.

ఇక ఈ సర్వే ప్రకారాం మెజారీ ఓటర్లు కాంగ్రెస్ పార్టీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని చెప్పారని సర్వే తెలిపింది. ఇక కాంగ్రెస్ పార్టీకి 115 నుంచి 127 సీట్లు వచ్చే అవకాశం ఉందని, బీజేపీకి 68 నుంచి 80 సీట్లు, జేడీఎస్ కు 23 నుంచి 35 సీట్లు వస్తాయని సర్వే తెలిపింది. ఇక 50 శాతం మంది ప్రజలు బీజేపీ ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నారని, కర్ణాటకలో ప్రభుత్వం మారాలని కోరుకుంటున్నారని సర్వే తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+