Making of Chandrayaan 3: హైదరాబాద్ సంస్థ సహా డజను యూనిట్లు ఇవే..

బెంగళూరు: కోట్లాదిమంది భారతీయుల నిరీక్షణ ఫలించింది. చందమామ చేతికి అందింది. జాబిల్లిపై త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగిరింది. భారత్.. నింగిని జయించింది. ఇస్రో చేపట్టిన చంద్ర మండల యాత్ర- విజయ తీరాలకు చేరింది. ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3 ల్యాండర్ మాడ్యుల్ ఈ సాయంత్రం 6:04 నిమిషాలకు జాబిల్లి మీద అడుగు మోపింది.

చంద్రుడి ఆర్బిటర్ నుంచి ఒక్కో దశలో కిందికి దిగింది చంద్రయాన్ 3 ల్యాండర్ మాడ్యుల్ విక్రమ్. అవరోహణ క్రమంలో కిందికి దిగుతూ వచ్చింది. అప్పటివరకు అండాకారంలో పరిభ్రమిస్తూ వచ్చిన విక్రమ్ ల్యాండర్.. చంద్రుడి ఉపరితలానికి సమీపించిన వెంటనే వర్టికల్‌గా మారింది. నిట్టనిలువుకు చేరుకుంది. అక్కడే సగం విజయం సాధించినట్టయింది.

Making of Chandrayaan 3: Major ISRO Centres involved in the design CH 3 mission include

అనంతరం ఒక్కో దశను అధిగమిస్తూ క్రమంగా చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ అయింది. దీనితో చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాలుగో దేశంగా ఆవిర్భవించింది భారత్. ఇంతకుముందు- రష్యా (సోవియట్ యూనియన్), అమెరికా, చైనా ఈ ఘనతను సాధించాయి. దక్షిణ ధృవంపై ల్యాండింగ్ చేసిన తొలి దేశం.. భారత్.

చంద్రయాన్ మిషన్‌ను తయారు చేయడంలో మొత్తం 12 సంస్థలు/యూనిట్లు భాగస్వామ్యం అయ్యాయి. ఇస్రోకు అనుబంధంగా లేక రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన కంపెనీలే. ఆ డజను కంపెనీల సమష్ఠి కృషితో చంద్రయాన్ 3 రూపుదిద్దుకుంది. ఈ జాబితాలో హైదరాబాద్‌కు చెందిన సంస్థ కూడా ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

యూఆర్ రావు శాటిలైట్ సెంటర్- బెంగళూరు, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్- తిరువనంతపురం, లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్- తిరువనంతపురం, బెంగళూరు, ఇస్రో శాటిలైట్ ట్రాకింగ్ సెంటర్- బెంగళూరు, స్పేస్ అప్లికేషన్స్ సెంటర్- అహ్మదాబాద్, ల్యాబొరేటరీ ఫర్ ఎలక్ట్రో-ఆప్టిక్స్ సిస్టమ్స్- బెంగళూరు కంపెనీలు ఇందులో భాగస్వామ్యం వహించాయి.

Making of Chandrayaan 3: Major ISRO Centres involved in the design CH 3 mission include

వీటితో పాటు ఇస్రో ఇనర్షియల్ సిస్టమ్స్ యూనిట్- తిరువనంతపురం, ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్- మహేంద్రగిరి, సతీష్ ధవన్ స్పేస్ సెంటర్- శ్రీహరికోట, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్- హైదరాబాద్, ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ, స్పేస్ ఫిజిక్స్ లాబొరేటరీ మేకింగ్ ఆఫ్ చంద్రయాన్ 3లో పాల్గొన్నాయి.

ఇవి కాకుండా నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, స్వీడిష్ స్పేస్ కార్పొరేషన్.. వంటి విదేశీ అంతరిక్ష పరిశోధన సంస్థలు ఇస్రోకు తమవంతు సహకారాన్ని అందించాయి. ఆయా కంపెనీలు, యూనిట్ల ప్రతినిధులకు సోమనాథ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం ప్రతి ఒక్కరికీ దక్కుతుందని వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+