నటి కిడ్నాప్, లైంగిక దాడి, దిలీప్ ఫ్రెండ్, నటుడు, దర్శకుడికి సమన్లు, రేపు హైకోర్టులో, !
ప్రముఖ నటి కిడ్నాప్, సామూహిక లైంగిక దాడి కేసులో మలయాళం నటుడు, దర్శకుడు, హీరో దిలీప్ స్నేహితుడు నాదిర్ షాకు కేరళ పోలీసులు సమన్లు జారీ చేశారు.
కొచ్చి: ప్రముఖ నటి కిడ్నాప్, సామూహిక లైంగిక దాడి కేసులో మలయాళం నటుడు, దర్శకుడు, హీరో దిలీప్ స్నేహితుడు నాదిర్ షాకు కేరళ పోలీసులు సమన్లు జారీ చేశారు. నటి లైంగిక దాడి కేసులో విచారణకు హాజరుకావాలని నాదిర్ షాకు గురువారం కేరళ పోలీసు అధికారులు సూచించారు.
నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసులో జూన్ 29వ తేదీన నాదిర్ షాను కేరళ పోలీసులు 13 గంటల పాటు విచారణ చేసి వివరాలు సేకరించి ఇంటికి పంపించారు. అనారోగ్యంగా ఉందని నాదిర్ షా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఇంతకాలం చికిత్స పొందుతూ ఇటీవలే ఇంటికి వెళ్లారు.

జులై 10వ తేదిన మలయాళం హీరో దిలీప్ ను విచారణ చేసిన పోలీసులు కేరళ పోలీసు క్లబ్ లోనే ఆయన్ను అరెస్టు చేసి జైలుకు పంపించారు. దిలీప్ అరెస్టు అయిన తరువాత తనను అరెస్టు చేస్తారనే భయంతో ఆసుపత్రిలో చేరిన నాదిర్ షా ముందుస్తు బెయిల్ కోసం కేరళ హైకోర్టును ఆశ్రయించారు.
శుక్రవారం నాదిర్ షా పిటిషన్ కేరళ హైకోర్టులో విచారణకు రానుంది. హైకోర్టులో ముందుస్తు బెయిల్ పిటిషన్ విచారణ జరిగే ఒక్క రోజు ముందే కేరళ పోలీసులు మీఅంతకు మీరు మా ముందు విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చెయ్యడంతో నాదిర్ షా హడలిపోయారు. ఫిబ్రవరి 17వ తేదీన నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసులో నాదిర్ షా ప్రమేయం ఉందని ఈ కేసులో అరెస్టు అయిన ప్రధాన నిందితుడు పల్సర్ సునీ కేరళ పోలీసులకు చెప్పాడని సమాచారం.
-
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!












Click it and Unblock the Notifications