Mamata Banerjee: ఐదోసారి జూనియర్ డాక్టర్లను చర్చలకు పిలిచిన మమతా బెనర్జీ..

కలకత్తా ఆర్జీ కర్ లో జూనియర్ వైద్యురాలు అత్యాచారం, హత్యకు గురైంది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన జరిగినప్పటి నుంచి పశ్చిమ బెంగాల్ లో జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తున్నారు. అక్కడి ప్రభుత్వం వారితో చర్చలు జరుపుతూనే ఉంది. తాజాగా సోమవారం సాయంత్రం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఐదోసారి సమావేశానికి ఆహ్వానించారు. దీంతో జూనియర్ డాక్టర్లు మమతా బెనర్జీ ఇంటికి చేరుకున్నారు. సమావేశాన్ని లైవ్ స్ట్రీమింగ్ లేదా వీడియో తీయాలని జూనియర్ వైద్యులు పట్టుబడుతున్నారు.

సమావేశాన్నిరికార్డ్ చేయడానికి అనుమతిస్తే చర్చలు జరపడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. లైవ్ స్ట్రీమింగ్ డిమాండ్‌ను ఇప్పటివరకు తిరస్కరించిన రాష్ట్ర ప్రభుత్వం.. మీటింగ్ మినిట్స్‌ను వైద్యులతో పంచుకోవడానికి అంగీకరించింది. లైవ్ స్ట్రీమింగ్‌పై భిన్నాభిప్రాయాల కారణంగా గత సమావేశంలో ఎలాంటి చర్చలు లేకుండానే ముగిశాయి. దీంతో సీఎం మమతా బెనర్జీ ఐదోసారి జూనియర్ వైద్యులను చర్చలకు ఆహ్వానించింది. ప్రభుత్వం తరఫున ఛీప్ సెక్రటరీ జూనియర్ డాక్టర్లకు లేఖ రాశారు.

Mamata Banerjee called the junior doctors for the fifth time for talks

"గౌరవనీయులైన ముఖ్యమంత్రి, మీ ప్రతినిధుల మధ్య సమావేశం కోసం మేము మిమ్మల్ని ఆహ్వానించడం ఇది ఐదోసారి, చివరిసారి. గౌరవనీయ ముఖ్యమంత్రితో సమావేశానికి మిమ్మల్ని మరోసారి ఆహ్వానిస్తున్నాము. ఆమె కాళీఘాట్ నివాసంలో ఓపెన్ మైండ్‌తో చర్చలు జరుపుతాం" అని బెంగాల్ చీఫ్ సెక్రటరీ మనోజ్ పంత్ వైద్యులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. సెప్టెంబర్ 14న ఆమె కాళీఘాట్ నివాసంలో ముఖ్యమంత్రిని కలిసిన అదే వైద్యుల బృందాన్ని ప్రభుత్వం ఆహ్వానించింది. వారిని సాయంత్రం 4.45 గంటలకు రావాలని కోరింది.

ఆర్జీ కర్ ఆస్పత్రిలో 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్‌పై జరిగిన దారుణమైన అత్యాచారం-హత్యకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలుపుతున్న వైద్యుల ప్రతినిధి బృందం సెప్టెంబర్ 14న మమతా బెనర్జీని ఆమె నివాసంలో కలిసిన సంగతి తెలిసిందే. అదే రోజు ఆమె స్వాస్థ్య భవన్ సమీపంలోని నిరసన ప్రదేశాన్ని ఆకస్మికంగా సందర్శించి, వారి డిమాండ్లను పరిష్కరిస్తామని డాక్టర్లకు హామీ ఇచ్చారు. ఈ సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చాయాలని వైద్యులు పట్టుబట్టడంతో నెల రోజుల పాటు ప్రతిష్టంభన కొనసాగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+