Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

"ఎన్నికలకు ముందు మరో పహల్గామ్ దాడి..??"

దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమ్ బెంగాల్ లోనూ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలోని అధికార టీఎంసీ మరోసారి విజయం సాధించాలని కృషి చేస్తోంది. అయితే బీజేపీ మాత్రం ఈ సారి బెంగాల్ సీఎం సీటు తమదేనని ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ పరిణామాల మధ్య బెంగాల్ సీఎం మమత బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.

బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను మతపరంగా విడదీసి తద్వారా రాజకీయంగా లబ్ది పొందేందుకు మరో పహల్గామ్ లాంటి ఘటనలు సృష్టించే అవకాశం ఉందని మమత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి డ్రామాల నేపథ్యంలో ప్రజలు, పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని తీవ్రమైన ఆరోపణలు చేశారు. దేశ సరిహద్దు వద్ద నిఘాను పటిష్టంగా ఏర్పాటు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం అవుతూందని ఆమె విమర్శించారు. తమ వైఫల్యాన్ని కప్పి పుచ్చుకునేందుకు రాష్ట్రంలో చొరబాట్లు అంటూ పక్కదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు.

కలకత్తా వరకు దాడులు చేస్తామని పాకిస్థాన్​ రక్షణ మంత్రి హెచ్చరిస్తుంటే.. మోదీ మౌనం వహించడం దారుణం అని బెంగాల్ సీఎం మమత పేర్కొన్నారు. బెంగాల్​ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఈ విషయంపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ప్రధాని మోదీకి బెంగాల్ ఎన్నికలే ముఖ్యం అని.. పాకిస్థాన్ బెదిరింపులు కాదని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సోమవారం నాదియా జిల్లాలో జరిగిన ఎన్నికల సభలో మమతా బెనర్జీ ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే మమత వ్యాఖ్యలపై బెంగాల్ బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఆమె వ్యాఖ్యలు దురదృష్టకరం అని దేశ సైన్యాన్ని అవమానించే విధంగా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయని ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే మమతా బెనర్జీ.. ప్రజల్లో ఇలాంటి భయాందోళనలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.

Mamata Slams Modi Failed to Respond to Pakistan s Threats PM Must Resign Mamata demands Modi

ఇక బెంగాల్ లోఅసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న తరుణంలో రాజకీయాలు రోజురోజుకీ మరింత హీటెక్కుతున్నాయి. ప్రధాన పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నాయి. 294 అసెంబ్లీ స్థానాలకు గానూ బెంగాల్ లో ఏప్రిల్​ 23, 29 రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇక మే 4న ఫలితాలు విడుదల కానున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+