వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చచ్చిన పామును కసాబిసా నమిలేశాడు-ఇక కరోనా నన్నేమీ చేయలేదన్నాడు-చివరికిలా..

|
Google Oneindia TeluguNews

తాగిన మైకం తందానా అనిపిస్తుంది... తల తిక్క పనులు చేయిస్తుంది... అరుంధతిలో జేజమ్మలా గంభీరమైన డైలాగులు పలికిస్తుంది... తాగింది దిగాక గానీ చేసిన హంగామా అర్థం కాదు... అచ్చు ఇలాగే తమిళనాడులోని మధురైకి చెందిన ఓ వ్యక్తి తాగిన మత్తులో నానా హంగామా చేశాడు. ఏకంగా కట్ల పామునే కసాబిసా నమిలి పారేశాడు. పైగా ఇక 'కరోనా నన్నేమీ చేయలేదురా...' అంటూ అరుంధతిలో జేజమ్మలా డైలాగులు కొట్టాడు. చివరకు విషయం పోలీసుల దాకా వెళ్లడంతో ఉసూరుమని ఏడ్చాడు. పోలీసుల కాళ్లా వేళ్లా పడి జరిమానాతో బయటపడ్డాడు.

ఇదీ జరిగింది...

ఇదీ జరిగింది...

మధురై జిల్లా పెరుమట్టి గ్రామానికి చెందిన వడివేలు(54) వ్యవసాయ కూలీ. స్థానికంగా వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల ఓరోజు మద్యం మత్తులో చచ్చిన కట్ల పామును మెడలో వేసుకుని వీధిలోకి వచ్చాడు. మద్యం మత్తులో తూలుతూ స్టెప్పులు కూడా వేశాడు. ఉన్నట్టుండి మెడలో ఉన్న పామును కసాబిసా నమిలిపారేశాడు.పైగా కరోనాకు పాము విరుగుడు అని... ఇక ఏ కరోనా తననేమీ చేయలేదని నోటికొచ్చింది వాగాడు.

వీడియో వైరల్... రూ.7వేలు జరిమానా

వీడియో వైరల్... రూ.7వేలు జరిమానా

కొంతమంది స్థానికులు ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. దీంతో విషయం జిల్లా అటవీ అధికారుల దాకా వెళ్లింది. అధికారులు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే రంగంలోకి వడివేలు ఆచూకీ గుర్తించి అరెస్ట్ చేశారు. తాగిన మత్తులో... కొంతమంది బలవంతం మేరకు తాను అలా చేయాల్సి వచ్చిందని వడివేలు పోలీసులకు వెల్లడించాడు.ఉసూరుమని ఏడుస్తూ తనను వదిలేయాలని బతిమాలాడు. మరోసారి ఇలాంటివి రిపీట్ చేయొద్దని హెచ్చరించిన పోలీసులు రూ.7వేలు జరిమానా విధించారు.

Recommended Video

#Krishnapatnam Medicine ఆయుర్వేదానికి పెరిగిన డిమాండ్.. పుత్తూరు కట్టు, చేప మందు సక్సెస్
అదృష్టవశాత్తు బతికి బయటపడ్డాడు...

అదృష్టవశాత్తు బతికి బయటపడ్డాడు...


అదృష్టవశాత్తు వడివేలు ఆ పాము విషగ్రంథిని కొరకలేదని పోలీసులు తెలిపారు. ఒకవేళ ఆ విషగ్రంథిని కొరికి ఉంటే ప్రాణాలతో ఉండేవాడో కాదోనని చెప్పారు. కట్లపాము విషంలో న్యూరోటాక్సిన్స్​ ఉంటాయని, అవి పక్షవాతాన్ని కలగజేస్తుందని ఫారెస్ట్ అధికారి ఒకరు వెల్లడించారు. కరోనాకు వైద్యులు సూచించిన మందులు,చికిత్స తీసుకోవాలని... అంతే తప్ప కరోనా పోతుందని తమకు తామే ఫిక్స్ అయి ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేయవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. కాగా,కొద్దిరోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌కి చెందిన కొందరు వ్యక్తులు ఒళ్లంతా పేడ పూసుకున్న వీడియో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. పేడతో స్నానం చేస్తే కరోనా పోతుందన్న నమ్మకంతో అలా చేస్తున్నామని వారు చెప్పారు. అయితే ఇలాంటి పనుల వల్ల కరోనా సంగతి పక్కనపెడితే లేనిపోని ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

English summary
The forest department arrested a 50-year-old agriculture worker from Madurai district on Thursday, reportedly after a video showing him chewing a dead snake spread like wildfire in cyberspace. The department also imposed a fine of Rs 7,000 on the accused, identified as Vadivelu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X