విమానంలో ఆమె ఉలిక్కిపడి!: ప్యాంట్ జిప్ తీసి.. అసభ్య రీతిలో అతను..
బెంగుళూరు-ముంబై విమానంలో జూన్ 27న ఓ మహిళ ప్రయాణికురాలు ప్రయాణించింది. ఆమె పక్క సీట్లో సబీన్ హంజా(31) అతను కూర్చున్నాడు. విమానం ఎక్కింది మొదలు.. ఆమెను వేధించడమే పనిగా పెట్టుకున్నాడు.
ముంబై: పక్క సీట్లో ఆడవాళ్లు కనిపిస్తే చాలు.. తమ వక్రబుద్దిని బయటపెట్టుకునే మగవాళ్లకు కొదువలేదు. ఈమధ్య విమాన ప్రయాణాల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా ఓ విమాన ప్రయాణికుడు.. ఏకంగా ప్యాంట్ జిప్ తీసి.. పక్కన ఉన్న మహిళను తీవ్రంగా వేధించాడు. విషయంపై మహిళ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో అతగాడికి చిక్కులు తప్పలేదు.
వివరాల్లోకి వెళ్తే.. బెంగుళూరు-ముంబై విమానంలో జూన్ 27న ఓ మహిళ ప్రయాణికురాలు ప్రయాణించింది. ఆమె పక్క సీట్లో సబీన్ హంజా(31) అతను కూర్చున్నాడు. విమానం ఎక్కింది మొదలు.. ఆమెను వేధించడమే పనిగా పెట్టుకున్నాడు. ఆమె నిద్రపోతున్న సమయంలో.. అసభ్యంగా తాకుతూ వెకిలి చేష్టలు ప్రదర్శించాడు.

ఇంతలో నిద్రలో నుంచి ఉలిక్కిపడ్డ మహిళా ప్రయాణికురాలు.. తన ఎదుట అతగాడు చేస్తున్న నిర్వాకం చూసి షాక్ తింది. చెప్పలేని చోట తాకుతూ లైంగిక చర్యకు పాల్పడుతున్నట్లు ఆమె గమనించింది. దీంతో విమాన సిబ్బందికి ఫిర్యాదు చేయడంతో.. వారు అక్కడికి వచ్చేలోగా.. ప్యాంట్ జిప్ పెట్టుకుని తనకేమి తెలియదన్నట్లు కూర్చున్నాడు.
తొలుత హంజాను సిబ్బంది కేవలం మందలించి వదిలేశారు. ఆ తర్వాత ఉదయం 7.45గం.కు బెంగుళూరు నుంచి విమానం ముంబైకి చేరుకోగానే ఎయిర్ పోర్టు పోలీసులకు అప్పగించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అతనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications