వాట్సప్‌లో అభ్యంతరకర సందేశాలు, అలజడి: వ్యక్తి అరెస్ట్
బహ్రెయిచ్: మొబైల్ అప్లికేషన్ వాట్సప్ ద్వారా ఓ మతానికి సంబంధించి అభ్యంతరకర సందేశాలను పంపిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాజేష్ రస్తోగి అనే వ్యక్తి తన మొబైల్ అప్లికేషన్ వాట్సప్ నుంచి ఓ మతానికి సంబంధించిన సందేశాలను పదే పదే పంపుతున్నాడు.
ఈ సందేశాలు నాన్‌పురా ప్రాంతంలో అలజడి రేపడంతో పాటు కొన్ని వర్గాల ప్రజల్ని ఆందోళనకు గురిచేశాయని పోలీసులు తెలిపారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, రస్తోగిని సోమవారం అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఓ మతానికి సంబంధించి తప్పుడు ప్రచారం చేస్తున్న కారణంగా అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్పీ ఆర్ఎల్ వర్మ తెలిపారు.
నిందితుడిపై కొందరు ఫిర్యాదు చేశారని ఆయన చెప్పారు. అతడు పంపించిన సందేశాలు ఆ ప్రాంతంలో కొంత అలజడి రేపాయని తెలిపారు.












Click it and Unblock the Notifications