ఆవుతో శృంగారం?: ఉత్తరాఖండ్‌లో యువకుడి నిర్వాకం.. అక్కడంతా హైటెన్షన్!
ఉత్తరప్రదేశ్ లో ఓ 23ఏళ్ల యువకుడు ఆవుతో శృంగారంలో పాల్గొన్నట్లు తెలుస్తోంది.
డెహ్రాడూన్: నిలువెల్లా కామంతో దహించిపోయిన ఓ వ్యక్తి ఏకంగా ఆవుతోనే సెక్స్‌లో పాల్గొన్న సంఘటన ఉత్తరాఖండ్‌లో చోటు చేసుకుంది. అయితే వైద్యాధికారులు మాత్రం దీనికి సంబంధించిన మెడికల్ రిపోర్టు ఇంకా రావాల్సి ఉందని చెబుతున్నారు.
విషయం బయటకు పొక్కడంతో.. ఏబీవీపీ, భజరంగ్ దళ్, ఇతర హిందుత్వ కార్యకర్తలు అతన్ని అరెస్టు చేయాలని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఘటన చోటు చేసుకున్న పౌరి జిల్లాలోని సత్పులి పట్టణంలో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. యువకుడి చర్యను నిరసిస్తూ గురువారం నాడు సత్పులి మార్కెట్లో దుకాణాలను మూసివేశారు.

ఆవుతో శృంగారానికి పాల్పడిన ఆ యువకుడు(23) అదే మార్కెట్లో ఒక ఫర్నీచర్ షాపు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో నిరసనకారులు అతని షాపును ధ్వంసం చేసినట్లు సమాచారం. షాపు ధ్వంసం అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తుండటంతో.. పోలీసులు అదనపు బలగాలను రంగంలోకి దించారు.
నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 377(అసహజ శృంగారం) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితుడు పౌరి జిల్లా కేంద్రంలో ఉన్న జైల్లో ఉన్నట్లు స్థానిక పోలీస్ అధికారి తెలిపారు.












Click it and Unblock the Notifications