వీడసలు మనిషేనా.. మేకను ఎత్తుకెళ్లి అత్యాచారం.. అడ్డొచ్చిన యజమానిపై..

ఈ డిజిటల్ యుగంలో దేశం ఓ వైపు సాంకేతికత, ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ అంటూ దూసుకెళ్తుంటే మరోవైపు మాత్రం సభ్య సమాజానికే మచ్చ తెచ్చేలా కొందరు ప్రవర్తిస్తుండటం దురదృష్టకరం. ఆడ, మగ, చిన్నా పెద్దా తేడా లేకుండా తమ కామవాంఛ కోసం నానాటికీ దిగజారిపోతున్నారు. ఆఖరికి మూగజీవాలపైనా వికృత చర్యలకు పాల్పడుతున్నారు. అలాంటి జుగుబ్సాకరమైన ఘటనే బెంగాల్ లో జరిగింది. వెస్ట్ బెంగాల్ లోని మాల్దాలో కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ యువకుడు ఏకంగా మేకపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాక ఇదేంటని అడ్డొచ్చిన మేక యజమానిపై దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు.

ఏం జరిగింది..?

మీడియా కథనాల ప్రకారం.. మాల్దాకు చెందిన ఓ వ్యక్తి తన మేకను పొలంలో మేతకు తీసుకెళ్లాడు. మేకను పొలంలో వదిలేశాడు. ఆయన ఏదో పనిలో నిమగ్నమయ్యాడు. ఆ తర్వాత కొంత సమయానికి పొలం వద్దకు వెళ్లగా మేక కనిపించలేదు. దీంతో చుట్టుపక్కల గాలించగా ఆచూకీ లభించలేదు. అలా మేక కోసం వెతుకుతూ వెళ్లగా ఓ పొలంలో మేక అరుపులు వినిపించాయి. దీంతో అక్కడికి వెళ్లి చూడగా.. ఓ యువకుడు మేకపై అత్యాచారానికి పాల్పడుతూ ఉన్నాడు. దీంతో ఆ కామాంధుడ్ని అడ్డుకునేందుకు వెళ్లగా అక్కడి నుంచి పారిపోయాడు.

MAN RAPES GOAT IN MALDA investigation underway

మేకను ఇంటికి తీసుకొచ్చిన ఆ వ్యక్తి.. ఈ విషయాన్ని గ్రామ ప్రజలకు చెప్పాడు. గ్రామ ప్రజలు ఆ కామాంధుడి చర్యకు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయం ఆ యువకుడికి తెలిసింది. గ్రామస్థులకు చెప్తావా అంటూ ఫుల్ గా మద్యం తాగొచ్చి మేక యజమాని, అతని కుటుంబంపై దాడికి దిగాడు. వెంటనే గ్రామస్థులు ఆ కుటుంబాన్ని కాపాడారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేక యజమాని కూడా ఈ వ్యవహారం మొత్తం పోలీసులకు పూసగుచ్చాడు. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలిస్తున్నామని తెలిపారు. త్వరలో నిందితుడ్ని పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+