ఇంట్లో దూరిన చిరుత పులి: ఫ్యామిలీ కోసం పోరాడాడు

Man puts up spirited fight with leopard to save family, chases it away
డెహ్రాడూన్: ఇటీవల ఢిల్లీ జూలో పులి బారిన పడి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇలాంటి ఘటనే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. అయితే ఇక్కడ ఓ యువకుడు తమ కుటుంబసభ్యుల కోసం ఇంట్లోకి ప్రవేశించిన చిరుత పులితో ఏమాత్రం బెదరకుండా పోరాడాడు. ఈ ఘటన గురువారం పిథోర్‌గఢ్‌లోని కమద్ గ్రామంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. ఓ కుక్కను వేటాడుకుంటూ వచ్చిన చిరుత పులి.. కెవ్లానంద అనే వ్యక్తి ఇంట్లో దూరింది. దీంతో భయాందోళనకు గురైన తల్లి ఇంటి నుంచి బయటికి వచ్చింది. ఆ సమయంలో ముగ్గురు పిల్లలు, భార్య తోపాటు కెవ్లానంద కూడా ఇంట్లోనే ఉన్నారు.

పిల్లలపై దూకేందుకు ప్రయత్నించిన చిరుత పులితో కెవ్లానంద వీరోచితంగా పోరాడాడు. దాదాపు 15 నిమిషాలపాటు ఆ చిరుత పులితో అతను పోరాడాడు. చిరుత దాడిలో అతని చేతులు, కాళ్లు, వీపు భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. అయినా అతను తన కుటుంబాన్ని రక్షించుకునేందుకు చిరుత పులితో పోరాటం ఆపలేదు.

కుటుంబసభ్యులు పెద్ద పెట్టున కేకలు వేయడంతో ఎక్కువ సంఖ్యలో గ్రామస్తులు అక్కడి చేరుకున్నారు. దీంతో అక్కడ్నుంచి చిరుత పరారయ్యింది. తీవ్ర గాయాలపాలైన కెవ్లానందను చికిత్స నిమిత్ం గోచ్చర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+