వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకోలేదని సోదరిపై దారుణం, అరెస్ట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెంగళూరు/చెన్నై: కర్నాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. తన మిత్రుడితో పెళ్లికి నిరాకరించినందుకు ఓ వ్యక్తి తన సోదరి వెంట్రుకలు కత్తిరించాడు. ఈ సంఘటన బెంగళూరు ఆర్టీనగర్ ప్రాంతంలో జరిగింది. సంతోష్ అనే వ్యక్తి తన సోదరి శిరోజాలను కత్తిరించాడు. ఇందుకు, తన మిత్రుడు సురేష్‌తో పెళ్లికి నిరాకరించడమే కారణమని తెలుస్తోంది. కాగా, పోలీసులు సురేష్, సంతోష్‌లను అరెస్టు చేశారు.

సోదరుడిని చంపాడు

34 ఏళ్ల గంగాధర్ అనే వ్యక్తి తన సోదరుడిని హత్య చేశాడు. ఈ సంఘటన కనకాపుర తాలుకాలోని హరోహల్లి గ్రామంలో జరిగింది. ఆగస్టు 11న అర్థరాత్రి ఈ హత్య జరిగింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Man tonsured sister's head for refusing to marry his friend

వ్యక్తి అరెస్ట్

ఢిల్లీలో కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి కుమారి సెల్జా నివాసంలో నిన్న వెలుగుచూసిన హత్యోదంతాన్ని పోలీసులు ఛేదించారు. సెల్జా పని మనిషి భర్త సంజయ్ హతుడై పడి ఉండడం పట్ల దర్యాప్తు ఆరంభించిన పోలీసులు వంటవాడే నిందితుడని తేల్చారు. ఈ మేరకు అతడిని అరెస్టు చేశారు.

వంట మనిషి అనిల్ యాదవ్, సంజయ్‌ల మధ్య ఘర్షణ జరిగిందని, ఆ గొడవలో సంజయ్ తీవ్రగాయాలతో మరణించాడని పోలీసులు తెలిపారు. అనిల్ ముఖంపై గాయాలుండడంతో అనుమానించిన పోలీసులు ఆ దిశగా విచారించారు. ఘర్షణ సమయంలో అనిల్ ధరించిన దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

English summary
Bangalore RT Nagar resident Santhosh tonsured sister head for refusing to marry his friend Suresh. RT Nagar police arrested Santhosh, Suresh escaped.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X