వైరల్ వీడియో: ఓ తాతా ఇవేం పనులు.. విమానం రన్‌ వే పైనే..

ప్రపంచంలోని స్వచ్చమైన దేశాల్లో ఈస్టోనియా, లక్సెబ్ బర్గ్, జర్మనీ, ఫిన్ లాండ్, యూకే ఉన్నాయి. అందుకు కారణం అక్కడి కఠిన చట్టాలు, పౌరుల క్రమశిక్షణ. ఇక భారత్ లో స్వచ్ఛ భారత్ లాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలు చేపట్టినా ఇంకా భారత ప్రజలు బహిరంగ మల, మూత్ర విసర్జనతో పాటు పబ్లిక్ ప్లేస్ ల్లో ఉమ్మి వేయడం, ధూమపానం చేయడం జరుగుతూనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా కొందరిలో ఎలాంటి మార్పు రావడం లేదు. అందుకు నిదర్శనమే ఈ ఘటన

బీహార్‌ లోని దర్భంగా విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది. ఓ వృద్ధుడు విమానం రన్‌ వేపై మూత్ర విసర్జన చేస్తున్నాడు. అందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఈ దృశ్యాన్ని విమాన పైలట్‌ కాక్‌ పిట్‌ నుంచి వీడియో తీశారు. అయితే ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ షాకింగ్ ఘటన ఎయిర్ పోర్ట్ భద్రత, సామాజిక ప్రవర్తన, అధికారుల బాధ్యతలపై పలు ప్రశ్నలను లేవనెత్తింది.

Man Urinates on Darbhanga Airport Runway Viral Video Sparks Outrage

గ్రామీణ ప్రాంతాల్లో బహిరంగ మూత్ర విసర్జన ఇప్పటికీ సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ విమానాశ్రయం వంటి ప్రదేశాల్లో అది కూడా రన్ వై ఇలా చేయడాన్ని పలువురు నెటిజెన్లు తీవ్రంగా కామెంట్స్ చేస్తున్నారు. ఓ వైపు ప్రయాణికులు విమానం ఎక్కుతుంటే మరోవైపు ఓ వ్యక్తి రన్ వై పై మూత్ర విసర్జన చేస్తున్న వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+