Manager: కంపెనీలో మహిళ మీద రేప్ చేసిన మేనేజర్, తప్పించుకోవాలని కారుతో ?
నోయిడా/న్యూఢిల్లీ: ప్రైవేట్ కంపెనీలో ఓ యువకుడు మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. అదే ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న మహిళతో మేనేజర్ గో చనువుగా ఉంటున్నాడని తెలిసింది. ఇటీవల సహద్యోగి అయిన మహిళ మీద మేనేజర్ అత్యాచారం చేశాడని ఆరోపణలు ఉన్నాయి. తన మీద మేనేజర్ అత్యాచారం చేశాడని మహిళ పోలీసు కేసు పెట్టింది. కేసు నమోదు చేసిన పోలీసులు మేనేజర్ కోసం వెతికారు. మేనేజర్ తలదాచుకున్న అపార్ట్ మెంట్ లోకి పోలీసులు వెళ్లారు. పోలీసుల నుంచి తప్పించుకోవాలని ఆ మేనేజర్ అపార్ట్ మెంట్ సెక్యూరిటీ మీద కారు తొక్కించుకుని వెళ్లిపోయాడు. తీవ్రగాయాలైన సెక్యూరిటీ గార్డు ఐసీయూలో ఉన్నాడు.

ప్రైవేట్ కంపెనీ మేనేజర్
నోయిడాలోని ఓ ప్రైవేట్ కంపెనీలో నీరజ్ సింగ్ అలియాస్ నీరజ్ అనే యువకుడు మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. కంపెనీ కార్యకలాపాలు చూసుకుంటున్న నీరజ్ చాలా బిజీగా ఉంటున్నాడని తెలిసింది. అదే కంపెనీలో ఓ మహిళ ఉద్యోగం చేస్తున్నది. దే కంపెనీలో ఉద్యోగం చేస్తున్న మహిళతో మేనేజర్ నీరజ్ చాలా చనువుగా ఉంటున్నాడని తెలిసింది.

రేప్ కేసు పెట్టిన మహిళ
ఇటీవల సహద్యోగి అయిన మహిళ నమ్మించి పిలుచుకుని వెళ్లిన నీరజ్ ఆమె మీద అత్యాచారం చేశాడని ఆరోపణలు ఉన్నాయి. తన మీద మా కంపెనీ మేనేజర్ నీరజ్ సింగ్ అత్యాచారం చేశాడని ఆ మహిళ నోయిడాలో పోలీసు కేసు పెట్టింది. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రైవేట్ కంపెనీ మేనేజర్ నీరజ్ కోసం గాలించారు.

ఫ్లాట్ లో నుంచి కారు పార్కింగ్ లోకి వెళ్లిపోయాడు
నోయిడాలోని ఓ హౌసింగ్ సోసైటీలోని అపార్ట్ మెంట్ లో అత్యాచారం చేసిన ఆరోపి నీరజ్ సింగ్ ఉన్నాడని పోలీసులకు సమాచారం అందింది. నీరజ్ ను పట్టుకోవడానికి నోయిడా పోలీసులు హౌసింగ్ సోసైటీలోని అపార్ట్ మెంట్ లోకి వెళ్లారు. పోలీసులు వచ్చారని తెలుసుకు నీరజ్ చాకచక్యంగా అపార్ట్ మెంట్ ఫ్లాట్ లోని గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న కారు పార్కింగ్ దగ్గరకు వెళ్లిపోయాడు.

సెక్యూరిటీ గార్డును చంపేసి తప్పించుకోవాలని ?
పోలీసులకు చిక్కకుండా వెళ్లిపోవాలని నీరజ్ అతని కారులో కుర్చుని వాహనం నడిపాడు. ఆ సందర్బంలో పోలీసులు, హైసింగ్ బోడ్డు సోసైటీలో ఉన్న సెక్యూరిటీ గార్డులు నీరిజ్ కారును అడ్డుకోవాలని ప్రయత్నించారు. ఆ సందర్బంలో నీరిజ్ సింగ్ సెక్యూరిటీ గార్డ్ అశోక్ మని అనే వ్యక్తి మీద కారు నడిపి అక్కడి నుంచి తప్పించుకున్నాడు.

సీసీటీవీ క్లిప్పింగ్స్ వైరల్
తీవ్రగాయాలైన సెక్యూరిటీ గార్డు అశోక్ మని ఐసీయూలో చికిత్స పొందుతున్నాడని పోలీసులు అన్నారు. సెక్యూరిటీ గార్డుల మీద నీరజ్ కారుతో తొక్కిస్తున్న సమయంలో అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడం, ఆ క్లిప్పింగ్స్ బయటకురావడంతో వైరల్ అయ్యాయి. అత్యాచారం, హత్యాయత్నం కేసుల్లో తప్పించుకుని తిరుగుతున్న నీరజ్ కోసం నోయిడా పోలీసులు గాలిస్తున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications